YCP MLA Mekapti Chandrasekar Reddy Fired on YCP Leaders.
నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీలోని తన వ్యతిరేకులపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసి వైఎస్ఆర్‌సీపీలో కలకలం రేపారు. తన ఎమ్మెల్యే పదవి విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గతంలో కొంతమంది తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అడ్డుపడ్డారని, కానీ జగన్ టికెట్ ఇవ్వడంతో తాను గెలిచానని, అలాంటి వారందరికీ అధికారంలోకి వచ్చాక తాను మంచే చేశానని అన్నారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. అయితే తాజాగా మరోసారి ఆయన చేసిన వ్యాఖ్యాలు హాట్ టాపిక్‌గా మారాయి.
ఆయన ఆదివారం మాట్లాడుతూ.. ఉదయగిరి వైసీపీ నేతలపై అగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి బదులు తను చనిపోయి ఉంటే బాగుండేదని సుబ్బారెడ్డి అనడం సరికాదని ఆయన అన్నారు. పార్టీలో ఒక పెద్దాయనకు డబ్బులు ఇచ్చి ఇంచార్జి పదవి తెచ్చుకుంటానని ప్రచారం చేస్తున్నాడని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే పోటీ చేస్తా..లేకుంటే లేదని ఆయన స్పష్టం చేశారు. ఆస్థిలో కూడా నా సోదరులు ఇంకా భాగాలు పెట్టి ఇవ్వలేదని, సుబ్బా రెడ్డి అంతు తేలుస్తానని హెచ్చరిస్తున్నానన్నారు.