Family Suicide: ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ.. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది.. పార్వతీపురం మన్యం జిల్లా, జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో ఓ కుటుంబం సూసైడ్స్ కలకలం రేగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.. అయితే, ఈ ఘటనలో తల్లి, తండ్రి సహా ఒక బాలుడు మృతి చెందగా, మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనలో మధు, సత్యవతి, మెషీలు మృతి చెందగా.. ఆయుష్ పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాలే కారణమా? ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి.. ఇతర కారణాలు ఏమైనా ఉండొచ్చా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.. అయితే, కుటుంబ మొత్తం ఆత్మహత్యకు ప్రయత్నించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.. ముగ్గురు మృతి చెందగా.. ప్రాణాలతో మరో బాలుడు కొట్టుమిట్టాడుతున్నాడు..
Read Also: Shashi Tharoor: రాహుల్ గాంధీ మీటింగ్‌లో అవమానం.. కాంగ్రెస్ కీలక సమావేశానికి శశి థరూర్ డుమ్మా!