వైసీపీకి ప్రచారం చేసిన.. కత్తి మహేశ్ కోసం ఒక్క ఎమ్మెల్యే రాలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదానికి గురై, చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతి పట్ల ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేశారు. ‘కత్తి మహేష్ మరణం ద్వారా ఆయనికి శత్రువులు ఉన్నారని రుజువు అయ్యిందన్నారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కారులో ముందు సీట్లో కూర్చున్న కత్తి మహేశ్ చనిపోయాడని… అదే కారులో పక్కనే కూర్చున్న వ్యక్తికి చిన్న గాయం కూడా కాలేదని అన్నారు. ప్రాణహాని లేదని చెన్నైకి తరలించారు. రెండు కళ్ళలో ఒకటి తీసివేస్తామని చెప్పారు. కళ్ళు తప్ప ఎక్కడా గాయాలు లేనప్పుడు ఎలా చనిపోయారు? అని మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులుగా సమస్య ఉత్పన్నం కానప్పుడు… ఐదు నిమిషాల ముందే ఎలా సమస్య వచ్చిందన్నారు. ప్రాణహాని లేదంటూనే ప్రాణం ఎలా పోయింది? అంటూ ప్రశ్నించారు. కత్తి మహేష్ మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.
Also Read
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
- Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
- OTR: సొంత జిల్లాలో రామ్మోహన్‌కు అసంతృప్తి సెగ?
- YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి కావాలని కత్తి మహేశ్ బాగా ప్రచారం చేశారు. తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కత్తి మహేష్ కృషి చేస్తే… ఆయన అంత్యక్రియలకు ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా రాలేదన్నారు. మేము ఎక్కడైనా కరివేపాకులమే అని దీంతో అర్థం అయ్యింది’ అంటూ మంద కృష్ణ మాదిగ తెలిపారు.
తాజావార్తలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని ధన లాభాలు!
-
Congress Disciplinary Action: కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!