Site icon NTV Telugu

Loan App Harassment: లోన్‌యాప్‌ వేధింపులు.. ఏపీలో మరో యువకుడు బలి

Loan App

Loan App

Loan App Harassment: కృష్ణా జిల్లా అవనిగడ్డలో లోన్‌యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. చల్లపల్లికి చెందిన మహమ్మద్ లోన్‌యాప్ వేధింపులు తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ పాల ఫాక్టరీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న మహమ్మద్‌.. హీరో ఫైనాన్స్ కార్పొరేషన్‌లో లోన్‌ తీసుకున్నారు. డబ్బు తిరిగి చెల్లిస్తున్నా.. ఇంకా కట్టాలంటూ అసభ్యకర మెసేజ్‌లు, కాంటాక్ట్‌ నెంబర్లకు ఫోన్లు చేసి వేధించారు. ఆ వేధింపులు భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు మహమ్మద్‌. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహమ్మద్‌కు రెండేళ్ల క్రితమే వివాహమైంది. ఐదు నెలల కుమారుడు కూడా ఉన్నాడు. కాగా, లింక్‌లు పంపి మరీ… లోన్‌ అడగకుండగానే.. లోన్‌ ఇచ్చేస్తున్న లోన్‌ యాప్‌లు.. ఆ తర్వాత వేధింపులకు గురిచేస్తూ ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీశాయి.. లోన్‌ యాప్‌ల జోలికి వెళ్లొద్దని పోలీసులు, అధికారులు హెచ్చరిస్తున్నా.. చాలా మంది ఇప్పటికీ వాటిని ఆశ్రయిస్తూనే ఉన్నారు.. వారి వలలో చిక్కుకుని వేధింపులు ఎదుర్కొంటున్నారు.. కొందరు ప్రాణాలు తీసుకుని.. వారి కుటుంబాన్ని విషాదంలో ముంచేస్తున్నారు. అవసరం అయితే.. బయట అప్పు చేయండి.. కానీ, లోన్‌ యాప్‌లను ఆశ్రయించవద్దు అని పోలీసులు సూచిస్తున్నారు.. ఇక, కొన్ని లోన్‌ యాప్‌లను బ్యాన్‌ చేసిన విషయం విదితమే.

Read Also: Jagadish Reddy : బండి సంజయ్ అజ్ఞానంతో అబద్దాలు మాట్లాడుతున్నాడు

Exit mobile version