Love Tragedy: చిత్తూరులో షాకింగ్ ఘటన.. వరుసకు కూతురయ్యే మైనర్ బాలికతో ఎఫైర్.. ఆ తర్వాత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man And Minor Girl Commits Suicide After Their Extramarital Affair Exposed: చిత్తూరు జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. వరుసకు కూతురు అయ్యే మైనర్ బాలికతో ఓ వ్యక్తి వివాహేతర సంబంధం నడిపించాడు. వావివరసలు మరిచి, ఆ వ్యక్తి మైనర్ బాలికని తన మాయమాటలతో బుట్టలతో పడేసి, ఎఫైర్ నడిపాడు. చివరికి తమ విషయంలో ఇంట్లో తెలియడంతో, ఇద్దరు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. షాక్‌కి గురిచేసే ఈ ఘటన పుంగనూరులో వెలుగుచూసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పుంగనూరులో నివాసముంటున్న గంగులయ్యకు పెళ్లి అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరోవైపు.. నక్షత్ర అనే మైనర్ బాలిక పుంగనూరు బసవరాజా బాలికల కళాశాలలో 10వ తరగతి చదువుతోంది. గంగులయ్యకు నక్షత్ర వరుసకు కూతురు అవుతుంది.
Also Read
అయితే.. గంగులయ్య వావివరసలు మరిచి, నక్షత్రను మాయమాటలతో తన బుట్టలో పడేసి, ఆ బాలికతో ప్రేమాయణం మొదలుపెట్టాడు. కొంతకాలం నుంచి వీళ్లిద్దరు ఎవ్వరికీ తెలియకుండా, గుట్టుగా తమ ఎఫైర్ నడుపుతున్నారు. అయితే.. వీరి ఎఫైర్ ఎంతోకాలం దాగి ఉండలేదు. వీరిద్దరు తరచుగా కలుస్తుండటం, ప్రవర్తనలోనూ మార్పు రావడాన్ని కుటుంబసభ్యులు గమనించారు. చివరికి.. వీళ్లిద్దరు అడ్డంగా దొరికిపోయారు. కుటుంబసభ్యులందరూ నిలదీయడంతో, వీళ్లిద్దరు మనస్తాపానికి గురయ్యారు. ముఖ్యంగా.. గుంగలయ్యను అందరూ నిలదీశారు. కూతురు వరుసయ్యే బాలికతో ఎలా ఎఫైర్ నడుపుతావంటూ మందలించారు. దీన్ని గంగులయ్య అవమానంగా భావించాడు. అటు, ఆ బాలిక కూడా తీవ్ర మనోవేదనకు గురైంది. వీరి వ్యవహారం పోలీస్ స్టేషన్‌దాకా కూడా వెళ్లింది.
Morphing Photos: నిశ్చితార్థం చెడగొట్టేందుకు కాబోయే భర్తకు మార్ఫింగ్ ఫోటోలు పంపిన మహిళ
అప్పటి నుంచి గుంగలయ్య, నక్షత దూరంగా ఉంటున్నా.. తమకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోయారు. అలాగే, ఒకరిని వదిలి మరొకరు ఉండలేకపోయారు. దీంతో.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో తెలియకుండా చింపారపల్లి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఓ చెట్టుకు ఉరివేసుకొని, ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్లు కనిపించకపోవడంతో ఇంటి పెద్దలు గాలించగా.. వీళ్లు ఉరివేసుకొని కనిపించారు. వీరి మరణంతో ఇరుకుటుంబాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. వీళ్లు నిజంగానే ఆత్మహత్య చేసుకున్నారా? లేకపోతే వీరిని చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!