Intermediate Education: ఇంటర్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థుల పాస్ పర్సంటేజీ, పాస్ మార్కుల విధానంలోనూ కీలక మార్పులు చేసింది. ఈ మేరకు తాజాగా ఏపీ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: Sanjay Roy: ఆర్జీ కర్ హత్యాచార దోషి ఇంట్లో చిన్నారి మృతదేహం కలకలం.. పోలీసుల దర్యాప్తు
ఇక, గణితంలో 1ఏ, 1బీ ఒకే సబ్జెక్ట్‌గా మార్పులు చేసింది. గతంలో ఒక్కో పేపర్‌కు 75 మార్కులు ఉండగా.. ఇప్పుడు పాస్ మార్కులను 26కి కుదించింది. ఇప్పుడు మ్యాథ్స్ ఒక్కటే పేపర్ 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. పాస్ మార్కులను 35గా ఫిక్స్ చేశారు. అలాగే, బైపీసీలో బోటనీ, జువాలజీ కలిపి బయాలజీగా మార్పు చేయగా.. ఫస్టియర్‌లో 85 మార్కులకు పరీక్ష నిర్వహిస్తుండగా 29 మార్కులు వస్తే పాస్ అవుతారు. సెకండియర్ లో 30 మార్కులు వస్తే పాస్ కానున్నారు.
Read Also: CM Chandrababu: నేడు దుబాయ్ పర్యటనకు సీఎం చంద్రబాబు..
అలాగే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విద్యార్థులకు 30 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ మార్కులు ఉండనున్నాయి. కాగా, గతంలో ఫెయిలై మళ్లీ ఇప్పుడు పరీక్షలు రాస్తున్న వారికి ఈ కొత్త మార్పులు వర్తించవు అని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో పాటు కొత్తగా ఎలక్టివ్ సబ్జె్క్ట్ విధానాన్ని కూడా విద్యా శాఖ అధికారులు తీసుకొచ్చారు. ఏ గ్రూప్ విద్యార్థులైనా 24 సబ్జెక్టుల్లో దేనినైనా ఎంపిక చేసుకునే వెసులు బాటు కల్పించారు.