Site icon NTV Telugu

Tirumala: టీటీడీ పాలకమండలి సరికొత్త నిర్ణయాలు.. టిటిడి పారిశుధ్య కార్మికులకు శుభవార్త

Untitled 17

Untitled 17

Tirumala: కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామీ కొలువై ఉన్న పుణ్యక్షేత్రం తిరుమల. ప్రతి రోజు కొన్ని లక్షల మంది భక్తులు తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని దర్శనార్ధం విచ్చేస్తుంటారు. అలాంటి తిరుమలను ఇంకా అభివృద్ధి చెయ్యాలని టిటిడి పాలకమండలి నిర్ణయాలు తీసుకుంది. ఈ విషయం పైన టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. టిటిడి పాలకమండలి తీసుకున్న నిర్ణయాల గురించి తెలియ చేశారు. ఇకపైన అలిపిరి వద్ద ప్రతి నిత్యం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. నారాయణగిరి ఉద్యాణవనంలో కంపార్టుమెంట్లు ఏర్పాటు చేసేందుకు 18 కోట్లు కేటాయిచమని వెల్లడించారు. అలానే ఆకాశ గంగ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు 40 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రోడ్డు, తిరుపతి లోని చేర్లోపల్లి నుంచి శ్రీనివాస మంగాపురం వరకు 25 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రోడ్డుని, వరహస్వామి అతిధి గృహం నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు 10.8 కోట్లతో నాలుగు వరుసల రోడ్డు నిర్మించనున్నట్లు అలానే గరుడా సర్కిల్ వద్ద రోడ్డు వెడల్పు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Read also:Warangal : మంత్రి పర్యటనకు బస్సులు.. స్కూల్ కి వెళ్లేందుకు విద్యార్థుల అవస్థలు

నారాయణగిరిలో హోటల్, అన్నమయ్య భవన్ లో హోటల్స్ ని టూరిజం శాఖకు అప్పగిస్తాం అని వెల్లడించిన ఆయన తిరుపతిలో టిటిడి అనుభంధ ఆలయాలు, భక్తులు సంచరించే ప్రాంతాలలో మేరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం ఆ భాధ్యతలను టిటిడి పరిధిలోకి తీసుకువచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలానే పురాతన ఆలయ గోపురాల నిర్వహణ పర్యవేక్షణకు నిపుణులతో కమిటి ఏర్పాటు చేయడంతో పాటుగా టిటిడి పరిధిలోని పాఠశాల విద్యార్దులుకు నాణ్యమైన భోజన సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు. ఇకపైన టిటిడి కళ్యాణ మండపాలలో వివాహాల సందర్భంగా డిజేలకు బదులుగా లలిత గీతాలు పాడుకోవడానికి మాత్రమే అనుమతిస్తాం అని పేర్కొన్నారు. టిటిడి ఆస్థాన విద్వాంసుడు గరిమేళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాని కోరుతు పాలకమండలి తీర్మానం చేసింది.

Read also:Fire Accident : టపాసుల పరిశ్రమలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి..

పాలకమండలి నూతన నిర్ణయాల నేపథ్యంలో టిటిడి పారిశుధ్య కార్మికుల జీతాలను 12 వేల నుంచి 17 వేలకు పెంచాలని నిర్ణయించింది. 5 వేల మంది పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచనున్నారు. అలానే టిటిడి పరిధిలోని కార్పోరేషన్ లో విధులు నిర్వర్తిస్తూన్న ఉద్యోగుల జీతాలను ప్రతి సంవత్సరం 3 శాతం పెంచేలా.. కార్పోరేషన్లో పని చేసే ఉద్యోగులు ఆకాల మరణం పోందితే వారికి 2 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించేలా.. కార్పోరేషన్ లో పని చేస్తూ ఈఏస్ఐ వర్తించని ఉద్యోగులుకు హేల్త్ స్కీం అందించేలా నిర్ణయం తీసున్నామని చైర్మన్ తెలిపారు. ఇక భక్తులు తమకు ముఖ్యమైన రోజులలో హోమంలో స్వయంగా పాల్గోనే అవకాశం కలిపించినట్లు పాలకమండలి తీర్మానించింది అని తెలియచేసారు.

Exit mobile version