Google and Twitter: గ్లోబల్ టెక్ కంపెనీలు ఇతర దేశాలతోపాటు ఇండియాలో కూడా ఖర్చులను తగ్గించుకోవటంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాయి. ఇన్నాళ్లూ ఉద్యోగులను రాత్రికిరాత్రే తీసివేయగా ఇప్పుడు ఆఫీసులను సైతం తెల్లారే సరికి మూసివేస్తున్నాయి. తాజాగా గూగుల్ మరియు ట్విట్టర్ సంస్థలు ఈ మేరకు చర్యలు చేపట్టాయి. గూగుల్ కంపెనీ 453 మందికి లేఆఫ్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 12 వందల మంది ఉద్యోగులను తీసేయటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.