Jr.NTR Political Entry: తెలుగుదేశం పార్టీ, జూనియర్ ఎన్టీఆర్ పొలిటిక్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు లక్ష్మీపార్వతి.. ఇప్పుడు తెలుగు దేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా లాభం లేదన్నారు.. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందన్న లక్ష్మీపార్వతి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి లాగా.. జనంలో ఉంటే ఐదేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌కు అవకాశం ఉండొచ్చు అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరన్న లక్ష్మీపార్వతి.. ఇకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వచ్చినా.. ఆయనకు పూర్తి బాధ్యతలు అప్పగించి.. ఒక ఐదేళ్ల పాటు ఆయన పూర్తిగా రాజకీయ శిక్షణ పొందుతూ.. ప్రజలతో మమేకం అవుతూ.. జగన్మోహన్‌రెడ్డిలా జనంతోనే ఉంటూ.. ముందుకు పోతే.. ఆ తర్వాత బెటర్ లక్ అన్నారు లక్ష్మీపార్వతి.
Read Also: Baba Ramdev: ఐదు సార్లు నమాజ్ చేస్తారు.. ఆ తరువాత హిందూ యువతులను కిడ్నాప్ చేస్తారు..
అయితే, జూనియర్ ఎన్టీఆర్ పొలిటిక్ ఎంట్రీపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. టీడీపీకి అసలైన వారసులు నందమూరి ఫ్యామిలీయేనని.. మళ్లీ తెలుగు దేశం పార్టీని బతికించాలంటే.. జూనియర్ ఎన్టీఆర్ లాంటి వారు రావాల్సిందే అని చర్చ సాగుతూ వచ్చింది.. ఇక, జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా యంగ్ టైగర్ పొలిటికల్ ఎంట్రీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరోవైపు.. చంద్రబాబు.. నందమూరి ఫ్యామిలీని వాడుకుంటున్నారు.. అవసరం అయినప్పుడు.. ఆ ఫ్యామిలీ మెంబర్స్‌ను తెరపైకి తీసుకురావడం.. అవసరం తీరిన తర్వాత పట్టించుకోకపోవడమే చంద్రబాబు నిజస్వరూపం అనే ఆరోపణలు, విమర్శలు లేకపోలేదు. ఇక, రాజకీయాలకు తగిన వయస్సు కాదంటూ జూనియర్ కొన్నిసార్లు క్లారిటీ ఇచ్చారు.
అయితే, టీడీపీ బతికి బట్ట కట్టాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే అనే వ్యాఖ్యలు గట్టిగానే వినపడ్డాయి. ఇప్పుడు మొత్తంగా.. జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.