యువతులు అన్ని రంగాల్లో దూసుకుపోతోందని చెబుతున్నారు. గుండమ్మ కథ మూవీలో.. లేచింది మహిళా లోకం.. దదరిల్లింది పురుష ప్రపంచం అని అప్పుడెప్పుడో ఎన్టీఆర్ టైంలోనే ఓ పాటేసుకున్నారు.. ఇప్పుడు మందేసి, చిందేసి తమ ప్రతాపం చూపుతున్నారు వనితామణులు. విశాఖలో అదే జరిగింది. తానేం తక్కువ తాగలేదు అని ఓ యువతి తనని తాను నిరూపించుకుంది. గంజాయి, బీరు తాగిన మైకంలో ఓ యువతి హల్చల్ చేసింది. విశాఖ ఆర్కే బీచ్ వైఎంసీఏ వద్ద యువతి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.
Read ALso: S Jaishankar: ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చిన మీరా మాట్లాడేది..? పాక్ తీరుపై నిప్పులు
గంజాయి మద్యం మత్తులో దుర్భాషలాడి త్రీ టౌన్ ఏఎస్ఐ పై దాడికి పాల్పడింది. పైగా కాలుతో తన్నిన యువతి ఉదంతం కలకలం రేపింది. నా బాయ్ ఫ్రెండ్ కి చెప్పి మిమ్మల్ని లేపించేస్తానంది అమూల్య. రేపటి నుంచి పోలీసులు ఎవరు రోడ్డుమీద తిరగకుండా చేస్తానని మైకంలో సవాల్ విసిరింది అమూల్య. ఆర్కే బీచ్ వైఎంసీఏ వద్ద బహిరంగంగా బండి మీద కూర్చొని బీరు తాగుతుండగా పోలీసులు చూశారు.
నైట్ రౌండ్స్ లో ఉన్న ఏఎస్ఐ ఆమెను చూసి వెళ్లి ప్రశ్నించగా బీర్ బాటిల్ తో పోలీస్ పై దాడి చేసింది. త్రీ టౌన్ ASI పై దాడి చేస్తుండగా అక్కడ ఉన్న యువకుడు మధ్యలో అడ్డురావడంతో అతని కన్నుపై బీరు బాటిల్ తగిలి గాయం అయింది. పైగా బ్రీతింగ్ అనలైజర్ తో చెక్ చేస్తే యువతి తాగిన మత్తు వ్యాల్యూ 149 వచ్చింది.దీంతో అమూల్య పై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. రాత్రి స్టేషన్ లో ఉంచకూడదని ఆమెని పంపించేశారు. ఉదయం రావాలని ఆదేశించారు. ఈఘటన విశాఖలో సంచలనంగా మారింది.
Read ALso:Vaishali Kidnap Case: వైశాలి కిడ్నాప్ కేస్.. నవీన్ రెడ్డితో సహా 14మందికి రిమాండ్