NTV Telugu Site icon

Tomato Price: టమాటా ధర భారీగా పతనం.. రైతుల గగ్గోలు..

Tomato

Tomato

Tomato Price: టమాటా ధర ఇప్పుడు నేలచూపులు చూస్తోంది. కర్నూలు జిల్లా పత్తికొండలో టమాటా మార్కెట్ కిలో టమాట రూపాయి, రూపాయి పావలా కూడా పలకని పరిస్థితి. 25 కిలోలు ఉన్న టమాటా బాక్సు 30 నుంచి 40 రూపాయలు లోపే అమ్ముకోవాల్సి వస్తోంది. పోనీ పంట ఎక్కువగా వస్తుంది.. ధర తగ్గిందా అంటే.. అదీ లేదు. వ్యాపారులకు సరిపడా టమాటా సరుకు రావడం లేదు. రేపో మాపో మార్కెట్ కూడా మూసివేయాల్సి వస్తోంది. అయినా టమాటాకు ధర మాత్రం దక్కడం లేదు. పంట వున్న ఈ వారం రోజుల్లో, పది రోజుల్లో అయినా కాస్త మంచి ధరకు అమ్ముకుందామంటే అతి తక్కువ ధర ఉంది. కనీసం టమాటా కోత కూలీలు, ఖర్చులు అయినా రావడం లేదని రైతులు వాపోతున్నారు.

Read Also: Adani Group: అదానీ గ్రూప్ కీలక నిర్ణయం.. విల్మర్‌తోజాయింట్‌ వెంచర్‌కు గుడ్ బై..

కర్నూలు జిల్లాలో ప్రధానంగా సాగుచేసే పంటల్లో టమాటా ఒకటి. జిల్లాలో సుమారు 40 నుంచి 50 వేల ఎకరాల్లో టమాటా సాగుచేస్తారు. పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, దేవనకొండ, ఆస్పరి, ఆలూరు, చిప్పగిరి, డోన్, ప్యాపిలి మండలంలో టమాట ఎక్కువగా సాగు చేస్తారు. ఏపీలో అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనూ టమాటా ఎక్కువగా సాగు చేస్తారు. ఎకరా టమాటా సాగుకు 30 వేలు పెట్టుబడి ఖర్చు అవుతుంది. కర్నూలు జిల్లాలో సెప్టెంబర్ నుంచే ఫిబ్రవరి వరకు టమాటా దిగుబడి బాగా ఉంటుంది. పత్తికొండ, ప్యాపిలి, డోన్ , బిల్లేకల్ ప్రాంతాలలో ప్రత్యేకంగా టమాటా మార్కెట్లు ఉన్నాయి. కర్నూలు జిల్లా నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నగరాలకు ఎక్కువగా రవాణా అవుతుంది. కర్నూలు జిల్లాలో ఒక్క పత్తికొండ మార్కెట్ నుంచే రోజుకు 200 టన్నుల టమాటా రవాణా అవుతుంది. పత్తికొండ, దేవనకొండ, ఆస్పరి, తుగ్గలి, మద్దికెర, ఆలూరు మండలాల నుంచి పత్తికొండ మార్కెట్ కు టమాటా తీసుకువస్తారు. టమాటా రవాణాకు దూరాన్ని బట్టి గంపకు 10 నుంచి 20 రూపాయలు ఖర్చు అవుతుంది. టమాటా ధర స్థిరంగా వుండే రోజులు చాలా తక్కువ. రైతు నుంచి కొనుగోలు చేసే ధర తక్కువ.. వినియోగదారునికి అమ్మే ధర ఎక్కువగా ఉంటుంది. టమోటా ధర కిలో ఒక్కోసారి రూపాయి కూడా వుండదు.

Read Also: KTR: మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం.. కేటీఆర్ రియాక్షన్ ఇదే(వీడియో)

ఒక్కోసారి 100 రూపాయలు దాటిపోతుంది. ప్రస్తుతం పత్తికొండ మార్కెట్‌లో 50 కిలోలు ఉన్న టమాటా జత గంపలు 400 నుంచి 900 రూపాయలు ఉంది. అంటే కిలో సరాసరి 10 రూపాయలు పడుతుంది. టమాటా పంటకు గిట్టుబాటు ధర లేక రైతుకు తీవ్రంగా నష్టపోవడం సర్వసాధారణమైంది. రైతులు ఎకరాకు 30 వేలకు పైగానే పేట్టుబడి ఖర్చు అవుతుంది. కేవలం టమాటా నారు కొనుగోలుకు ఎకరాకు సుమారు 10 వేలు ఖర్చు అవుతుంది. పంట పండిన తరువాత టమాటా తెంపేందుకు కూలీ ఖర్చు ఒక్కొక్కరికి 200 నుంచి 300 చొప్పున వేలల్లో కూలీల ఖర్చు ఉంటుంది. రవాణాకు గంపకు 10 నుంచి 20 చొప్పున ఖర్చు చేయాలి. తీరా మార్కెట్ కు వెళ్తే జత టమాటా గంపలు ఒక్కోసారి 50 రూపాయలు లోపే వుంటుంది. అంటే కిలో టమాటా 50 పైసలు నుంచి రూపాయ లోపే రైతుకు దక్కుతుంది. కూలీలు, రవాణా ఖర్చులు పొగా రైతుకు చిల్లిగవ్వ కూడా దక్కని సందర్భాలు చాలా వున్నాయి.

Show comments