టమాటా ధర ఇప్పుడు నేలచూపులు చూస్తోంది. కర్నూలు జిల్లా పత్తికొండలో టమాటా మార్కెట్ కిలో టమాట రూపాయి, రూపాయి పావలా కూడా పలకని పరిస్థితి. 25 కిలోలు ఉన్న టమాటా బాక్సు 30 నుంచి 40 రూపాయలు లోపే అమ్ముకోవాల్సి వస్తోంది. పోనీ పంట ఎక్కువగా వస్తుంది.. ధర తగ్గిందా అంటే.. అదీ లేదు. వ్యాపారులకు సరిపడా టమాటా సరుకు రావడం లేదు. రేపో మాపో మార్కెట్ కూడా మూసివేయాల్సి వస్తోంది. అయినా టమాటాకు ధర మాత్రం…