Gadikota Srikanth Reddy: సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు సిద్ధం అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా ఉన్నదే చంద్రబాబు.. ప్రజలను మభ్యపెడుతూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు.. 16 ఏళ్లుగా సీఎంగా ఉన్న వ్యక్తి తాను చెప్పుకునేందుకు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించలేదు, పూర్తి చేయలేదు అని విమర్శించారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి రాయలసీమను రతనాల సీమను చేస్తారట అని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటుతో దించిన తరువాత ఇరిగేషన్ గురించి పట్టించుకోలేదు.. పదేళ్లు ఒక్క ప్రాజెక్టు చేపట్టలేదు.. హంద్రీనీవా, గాలేరు నగరిని వదిలేశారు.. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం.. హంద్రీనీవా ప్రాజెక్టు సాధ్యమయ్యేది కాదని 1998లో జీఓ ఇచ్చారు.. హంద్రీనీవాను 40 టీఎంసీలు కాదు 5 టీఎంసీలతో తాగునీటికి చాలని జీఓ ఇచ్చారని గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Nagar Kurnool: శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట, దోమల పెంట పేర్లు మార్పు.. కొత్త పేర్లు ఇవే
ఇక, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక ఇరిగేషన్, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. తెలుగుగంగ ప్రాజెక్టు పూర్తి చేసి గాలేరు నగరి, హంద్రీనీవా చేపట్టాలని జీఓ తెచ్చారు.. ఐదేళ్లలో హంద్రీనీవా పూర్తి చేయడానికి వైఎస్సార్ సంకల్పించారు.. చంద్రబాబు అన్నీ తానే చేశానని చెబుతారు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టానంటారు, టల్ బిహారీ వాజపేయికి నేనే చెప్పానంటారు.. రాజశేఖర్ రెడ్డి గొప్ప ఆలోచనలతో సాగునీరు ప్రాజెక్టులు చేపట్టారు.. చంద్రబాబు పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టు కోసం రూ. 90 కోట్లు ఖర్చు పెడతానంటారు.. రాజశేఖర్ రెడ్డి అనుమతులు తెచ్చి ప్రాజెక్టులు నిర్మించారా.. సంకల్పంతో వైఎస్సార్ ప్రాజెక్టులు నిర్మించి అనుమతులు తెచ్చారు.. పోలవరంపై ఉద్యమం చేస్తే చంద్రబాబు కేసులు పెట్టించారు అని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
Read Also: HHVM : హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్స్ లిస్ట్ ఇదే
అయితే, ప్రాజెక్టులను నాశనం చేసిన చంద్రబాబు.. మళ్లీ జగన్ ను విమర్శిస్తున్నారని గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు ఉంటే ఏమౌతుంది.. కర్నూలు నుంచి హైకోర్టు, లా యూనివర్సిటీని తరలించుకుపోయారు.. హైకోర్టు వస్తే ఏమోస్తుంది.. టైప్ మిషన్లు వస్తాయని చంద్రబాబు అన్నారు.. ఎవరికో పుట్టిన బిడ్డ నాకు పుట్టినట్టు, ఎవరో చేసిన ప్రాజెక్టులు తను చేసినట్టు చంద్రబాబు చెబుతున్నారు.. చంద్రబాబు చిత్తశుద్ధి, ద్రోహం గురించి ప్రజలు ఆలోచించాలి.. పోలవరం ప్రాజెక్టును తగ్గించడం నుంచి డైవర్ట్ చేయడానికి బనకచర్ల పాట పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 ఏళ్ళు సీఎంగా చంద్రబాబు ఏమి సాధించారో చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
