NTV Telugu Site icon

Minister Anam: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుపుతాం..

Srisilam

Srisilam

Minister Anam: శ్రీశైలంలో మహా శివరాత్రి ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్ష ముగిసింది. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.. ఈనెల 25, 26 రెండు రోజులు శ్రీశైలం టోల్ గేట్లు ఉచితం చేస్తాం.. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆగమ శాస్త్రాలకు పండితుల సలహాతో శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తాం.. అటవీ మార్గంలో వచ్చే భక్తులకు మంచి నీరు, ఆహారం ఏర్పాటు చేస్తామన్నారు. అటవీశాఖ నిబంధనలతో ఉన్న త్రాగు నీటి ప్లాస్టిక్ బాటిళ్లను సమీకరించి తీసి వేయాలని సూచించామన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 30 శాతం భక్తులు ఎక్కువగా వస్తారని అంచనా వేస్తున్నాం.. ట్రాఫిక్ సమస్య లేకుండా పార్కింగ్ ఏర్పాటు సీసీ కెమెరాలతో భక్తులకు సత్రాలకు వెళ్లేందుకు మినీ వ్యాన్లు ఏర్పాటు చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు.

Read Also: Purandeswari: కేంద్ర జలశక్తి మంత్రికి బీజేపీ ఎంపీ పురంధేశ్వరి లేఖ..

ఇక, ఉత్సవాల ప్రధాన దినాల్లో ఉచితంగా భక్తులకు లడ్డూ ఇవ్వాలని నిర్ణయించామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం పేర్కొన్నారు. పోలీసులకు బైక్స్, 4 వీలర్స్ సమకూరుస్తాం.. శ్రీశైలంలోనే వాడాలని నిబంధన పెట్టాం.. దర్శనాలు సామాన్య భక్తులకు ఎక్కువ సేపు కేటాయించి వీఐపీ దర్శనాల అవసరమైతే అర్ధగంట తగ్గించాలని చెప్పాం.. వచ్చి వెళ్లే భక్తుల రాకపోకలు డ్రోన్స్ తో పర్యవేక్షిస్తాం.. కంపార్ట్మెంట్లు, అవసరమైతే రోప్ పార్టీలను పెట్టి భక్తులను క్యూలైన్స్ లోకి వదిలి తొక్కి సలాటకు ఆస్కారం లేకుండా చూస్తామన్నారు. దోర్నాల- ఆత్మకూరు రోడ్డును మరమ్మత్తులు చేయిస్తామని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.