Governor Abdul Nazeer: బంగారు పథకాలు వచ్చిన వారిలో 80 శాతం బాలికలు.. ఇది బాలురకు హెచ్చరిక..!

  • బంగారు పథకాలు వచ్చిన వారిలో 80 శాతం మంది బాలికలు..
  • ఇది బాలురకు హెచ్చరిక కూడా అన్న గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్ నజీర్‌..
  • రాయలసీమ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్..
Governor Abdul Nazeer

Governor Abdul Nazeer

Governor Abdul Nazeer: బంగారు పథకాలు వచ్చిన వారిలో 80 శాతం మంది బాలికలు ఉన్నారు.. ఇది బాలురకు హెచ్చరిక కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్ నజీర్‌.. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన.. రాయలసీమ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.. స్నాతకోత్సవంలో విద్యార్థులకు బంగారు పథకాలు అందచేసిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. బంగారు పథకాలు వచ్చిన వారిలో 80 శాతం బాలికలు వున్నారు.. ఇది బాలురకు హెచ్చరిక కూడా.. బాలురు కూడా కష్టపడి బంగారు పథకాలు తెచ్చుకోవాలని సూచించారు.. విద్యతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.. విద్య వ్యక్తిగత అభివృద్ధికి పునాది వేస్తుందన్నారు.. ఉన్నత విద్య ఆర్థిక, సామాజిక అసమానతలను తొలగిస్తుంది.. డిగ్రీలు యువతకు విలువైన పెట్టుబడిగా అభివర్ణించారు.. ఇక, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ పై విద్యార్థులు దృష్టిపెట్టాలని సూచించారు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్ నజీర్‌..

Read Also: Thota Tharani: తోట తరణి ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు..