గత కొంతకాలంగా వాయిదా పడుతూ వచ్చిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనను ఎట్టకేలకు పూర్తి చేసింది కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్యుల టీమ్.. కర్నూలు జిల్లాలో పర్యటించిన కేఆర్‌ఎంబీ.. ముచ్చుమర్రి ఎత్తిపోతలను పరిశీలించిన తర్వాత పోతిరెడ్డిపాడు సమీపంలోని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా పరిశీలించింది. కృష్ణా నది జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలించి నివేదిక సమర్పించాలంటూ.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేఆర్‌ఎంబీ టీమ్ పర్యటన కొనసాగింది.
రాయలసీమ ఎత్తిపోతల పనులు పరిశీలించామని తెలిపారు కేఆర్‌ఎంబీ కన్వీనర్ రాయ్‌పురే.. దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఈ నెల 16వ తేదీలోగా నివేదిక సమర్పిస్తామన్నారు.. ఎత్తిపోతల పనుల పరిశీలనపై కోర్టుకు నివేదిస్తామన్నారు. ఇక, రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ గురించి కేఆర్‌ఎంబీకి వివరించామని తెలిపారు సీఈ మురళీధర్.. ముచ్చుమర్రి లిఫ్ట్‌ను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులర్ ఎందుకు మార్చామో వివరించామని.. సర్వే పనులు చేస్తున్నాం.. ప్రాజెక్టు పనులు ప్రారంభించలేదని స్పష్టం చేశారు. దీనిపై సీడబ్ల్యూసీకి డీపీఆర్ సమర్పించాం.. పర్యావరణ అనుమతుల కోసం ఎన్టీటీకి పంపామని.. అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు సీవో మురళీధర్.