NTV Telugu Site icon

Perni Nani: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో వైసీపీ పోరాటం చేస్తుంది..

Perni Nani

Perni Nani

Perni Nani: వక్ఫ్ సవరణ బిల్లు 2024కి వ్యతిరేకంగా ముస్లీం వర్గాలు చేస్తున్న మహా ధర్నాకి వైసీపి మద్దతు ఇచ్చింది. ఈ ధర్నాకు హాజరైన మాజీ మంత్రి పేర్నినాని, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, వైసీపీ నేతలు షేక్ ఆసిఫ్, నూరి ఫాతిమా, నారాయణమూర్తి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు మద్దతు ఇస్తున్నాం.. పార్లమెంట్ లో కూడా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని తేల్చి చెప్పారు. ఇక, ముస్లిం వ్యక్తుల సంప్రదాయాలు, వ్యవహారాల్లోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్నాం.. ముస్లింలకు రంజాన్ తోఫా ఇస్తామని అధికారంలోకి వచ్చిన టీడీపీ.. రంజాన్ సమయంలో జరుగుతున్న దాడిని ఖండించడం లేదు అని మాజీమంత్రి పేర్నినాని పేర్కొన్నారు.

Read Also: Kunal Kamra: ఇరాకటంలోకి కునాల్ కమ్రా.. తాజాగా మరో 3 ఎఫ్ఐఆర్‌లు

ఇక, టీడీపీ పాలనకు బ్రిటిష్ పాలనకు పెద్ద తేడా లేదు అని పేర్నినాని ఆరోపించారు. సీఐఐకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత జగన్ ది.. జగన్ చేసినట్లు చంద్రబాబు చేయగలడా అని ప్రశ్నించారు. 40 ఏళ్ల అనుభవం నాలుగు సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటే కాదు ఆచరణలో చేసి చూపించాలి.. పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వైసీపీ పోరాటం చేస్తుంది అని వెల్లడించారు.