Site icon NTV Telugu

AP Crime: భార్య చేతిలో భర్త హతం.. స్క్రూడ్రైవర్‌తో పొడిచి..!

Crime

Crime

AP Crime: కృష్ణా జిల్లాలో భార్య చేతిలో ఓ భర్త హతం అయ్యాడు.. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది.. బంటుమిల్లి మండల పరిధిలోని చిన్న తుమ్మడి గ్రామంలో అప్పారావు, కీర్తన దంపతులు నివాసం ఉంటున్నారు.. వీరికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది.. వారికి ఏడేళ్ల బాలుడు కూడా ఉన్నారు.. అయితే, మంగళవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.. అది కాస్తా తీవ్రమైన ఘర్షణకు దారితీసింది.. కోపంతో ఊగిపోయిన కీర్తన.. క్షణికావేశంతో స్క్రూడ్రైవర్ తో అప్పారావుపై దాడి చేసింది.. అప్పారావు మెడపై స్క్రూడ్రైవర్‌తో పొడిచింది.. దీంతో అక్కడికక్కడే అప్పారావు ప్రాణాలు విడిచాడు.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న బంటుమిల్లి పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. అయితే, దంపతుల మధ్య ఎందుకు గొడవ వచ్చింది.. కట్టుకున్నవాడినే ఆమె ఎందుకు మట్టుబెట్టింది లాంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: MLA Chirri Balaraju: గిఫ్ట్‌గా ఇచ్చిన కారును వెనక్కి పంపిన జనసేన ఎమ్మెల్యే..

Exit mobile version