Vijaya Dairy Board Emergency Meeting: విజయ డైరీలో కీలక పరిణామం.. రేపటికి వాయిదా పడిన బోర్డు అత్యవసర సమావేశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijaya Dairy Board Emergency Meeting: విజయ డైరీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయ డైరీ బోర్డు అత్యవసర సమావేశం వాయిదా పడింది. సమావేశానికి అవసరమైన కోరం సరిపడా లేకపోవడంతో రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు తాజా పరిణామాలపై నిర్ణయం తీసుకునే ముందు విజయ డైరీ ఎండీ లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా విజయ డైరీ మాజీ చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ.. సమావేశంలో తాజా పరిణామాలపై చర్చించినట్లు తెలిపారు. కోరం లేకపోవడంతో సమావేశాన్ని రేపటికి వాయిదా వేసినట్లు వెల్లడించారు. బోర్డు సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. కోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నారు.
కోరం లేకపోయినా రేపు మరోసారి సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చలసాని తెలిపారు. కృష్ణా మిల్క్ యూనియన్ రైతుల సంస్థ అని, అందులో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించుకుంటామని చెప్పారు. టీడీపీ నిర్ణయం మేరకే తాను గతంలో పదవి నుంచి తప్పుకున్నానని, ఇప్పుడు కూడా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానిని అమలు చేస్తామని స్పష్టం చేశారు. అయితే పార్టీ అన్ని అంశాల్లోనూ జోక్యం చేసుకోదని, ఎవరినీ ఇబ్బంది పెట్టదని చలసాని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తలెత్తిన సమస్యను ఎలా పరిష్కరించాలనే అంశంపై రేపటి సమావేశంలో స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో విజయ డైరీలో రేపు జరిగే బోర్డు సమావేశం, తీసుకోబోయే నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది. కాగా, విజయ డెయిరీ బోర్డు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం విదితమే.. విజయ డెయిరీ చైర్మన్ దాసరి బాలవర్ధన్ రావు ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. చైర్మన్‌తో పాటు మరో నలుగురు బోర్డు డైరెక్టర్ల ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. విజయ డైరీ చైర్మన్ దాసరి బాలవర్ధన్ రావు (గన్నవరం)తో పాటు సాయి (ఘంటసాల), పాలడుగు నాని (గన్నవరం), నాగేశ్వరరావు (నందిగామ), శైలజ (మైలవరం) డైరెక్టర్ల ఎన్నికను సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ఐదుగురు బోర్డు సభ్యులపై పోటీ చేసిన అభ్యర్థులను డిఫాల్టర్లుగా ప్రకటించడంతో వారి ఎన్నికల చెల్లుబాటుపై వివాదం తలెత్తింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన హైకోర్టు పోటీ చేసిన అభ్యర్థులు అనర్హులని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు..
Also Read
- TDP vs YSRCP: గుడివాడ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. మున్సిపల్ ఎన్నికల వేళ వైసీపీలో చేరిన టీడీపీ నేత
- Vallabhaneni Vamsi: పక్షపాతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. వల్లభనేని ఫైర్
- Perni Nani: చంద్రబాబు, పవన్, మాధవ్.. మీకు ఎందుకు ఓట్లు వేయాలి? పేర్ని నాని ప్రశ్నల వర్షం
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
తాజావార్తలు
-
Vijaya Dairy Board Emergency Meeting: విజయ డైరీలో కీలక పరిణామం.. రేపటికి వాయిదా పడిన బోర్డు అత్యవసర సమావేశం!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
Lakshya Raichandani: ఆ ఐపీఎల్ టీమ్‌లో ఆడడమే నా టార్గెట్.. మనసులో మాట చెప్పేసిన అండర్-19 కెప్టెన్!
-
Cyclone Akwan: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
ట్రెండింగ్
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!