NTV Telugu Site icon

Vallabhaneni Vamsi Wife: పోలీస్స్టేషన్ లోపలికి వంశీ భార్యను అనుమతించని పోలీసులు..

Vallabhaneni Wife

Vallabhaneni Wife

Vallabhaneni Vamsi Wife: కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అనేక కోణాల్లో దీర్ఘంగా విచారిస్తున్నారు పోలీసులు. టీడీపీ గన్నవరం కార్యాలయం పైనా దాడి నేపథ్యం గురించి ప్రశ్నిస్తున్నారు. దాడిలో ఎంత మంది పాల్గొన్నారు.. దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందని అని వంశీని క్వశ్చన్ చేస్తున్నారు. విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడలోని జీజీహెచ్ కు వల్లభనేని వంశీని తరలించనున్నారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం విజయవాడ ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో పోలీసులు హాజరు పర్చనున్నారు.

Read Also: Mstan Sai Case: మస్తాన్ సాయి కేసులో పోలీసులు కీలక పరిణామం..

అయితే, వల్లభనేని వంశీ కన్ఫెషన్ ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. కొన్ని ఎవిడెన్స్ బేసెస్ గా వల్లభనేని వంశీని ప్రశ్నిస్తున్నారు. దీని ఆధారంగా వంశీ ఇచ్చిన వాంగ్మూలంతో పాటు ఎవిడెన్స్ ను బేస్ చేసుకుని రిమాండ్ రిపోర్ట్ ఫైల్ చేయనున్నారు. రిమాండ్ కు తరలిస్తే కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. గంట నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Read Also: Aaditya Thackeray: బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలనుకుంటోంది.. ఢిల్లీలో ఆదిత్య ఠాక్రే..

ఇక, కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వల్లభనేని వంశీ సతీమణి వచ్చారు. వంశీని కలిసేందుకు ఆమెను పీఎస్ లోపలకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.. దీంతో మీడియాతో మాట్లాడియా వంశీ భార్య పంకజశ్రీ.. మమ్మల్ని ఎందుకు లోపలికి అనుమతించడం లేదని క్వశ్చన్ చేశారు. ఆయన ఆరోగ్యంపై మాకు ఆందోళనగా ఉంది.. వంశీని చూడటానికి లోపలికి పంపాలని ఆమె కోరారు. మరోవైపు, కక్షపూరితంగా వంశీపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు అంటూ మరోవైపు ఆయన తరపు లాయర్ ఆరోపించారు.