Vallabhaneni Vamsi: కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సుమారు 8 గంటల పాటు గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు ప్రశ్నించారు. కాగా, ఇప్పటికే జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీకి వైద్య పరీక్షలు పూర్తి కావడంతో.. విజయవాడలోని నాల్గవ అదనపు న్యాయమూర్తి ముందు వంశీని పోలీసులు ప్రవేశ పెట్టారు. వల్లభనేని వంశీతో పాటు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో ఏ7గా ఉన్న ఎలినేని వెంకట శివరామకృష్ణ, ఏ8 నిమ్మ లక్ష్మీపతి అనే ఇద్దరు నిందితులను కూడా ఉన్నారు. ఇప్పటికే కోర్టులోనే వంశీ తరపు న్యాయవాదులు కూడా ఉన్నారు.
అయితే, వల్లభనేని వంశీని కోర్టులో హాజరుపర్చగా ఆయన సతీమణి పంకజశ్రీ కూడా వచ్చారు. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో మొత్తం మొత్తం 8 మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో, ఏ1 వంశీ సహా ఏ7, ఏ8 లు ఇవాళ అరెస్టు కాగా.. ఏ2 కొమ్మా కోట్లు, ఏ3 భీమవరపు రామకృష్ణ, ఏ4 గంటా వీర్రాజుగా గుర్తించి.. వారిపై కూడ పోలీసులు కేసు నమోదు చేశారు.