Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీని పరామర్శించిన కొడాలి నాని, పేర్నినాని

  • వల్లభనేని వంశీని కలిసిన కొడాలి నాని, పేర్నినాని..
  • వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కొడాలి నాని..
  • పార్టీ అండగా ఉంటుందని వంశీకి ధైర్యం చెప్పిన పేర్నినాని
Vamshi

Vamshi

Vallabhaneni Vamsi: కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ ఇటీవల జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో, ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో ఉన్న ఓ వైసీపీ నేత ఇంట్లో వంశీని మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్నినాని ఆత్మీయంగా కలిసి పరామర్శించారు. అలాగే, వంశీ ఆరోగ్యంపై ఇరువురు నేతలు అడిగి తెలుసుకున్నారు.

Read Also: Surya Sethupathi: విజయ్ సేతుపతి కొడుకుపై ప్రశంసల వర్షం.. కానీ డిజాస్టర్ కలెక్షన్?

×
×
Ad

అయితే, వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్నినాని మధ్య కొంతసేపు పలు అంశాలపై చర్చలు జరిగాయి. వంశీతో పాటు, అన్ని కేసుల్లో అరెస్టైన ఆయన అనుచరులను కూడా కొడాలి నాని పరామర్శించారు. ఈ ఉదయం కోర్టు విధించిన షరతుల మేరకు గుడివాడ, గన్నవరం పోలీస్ స్టేషన్లలో కొడాలి నాని, వల్లభనేని వంశీ సంతకాలు చేశారు.