Kodali Nani: రావణ్ అరెస్టుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. ఆయన టీడీపీయే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodali Nani: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని.. రావణ్ అరెస్టు అంశంపై స్పందిస్తూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రావణ్ తెలుగుదేశం పార్టీకి అనుకూల వ్యక్తి అని, ఆయన లోకేష్, బాలకృష్ణ, చంద్రబాబులకు అనుకూలంగా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. అందువల్లే టీడీపీ నాయకులపై ఆయన ఎప్పుడూ విమర్శలు చేయరని అన్నారు. రావణ్‌పై టీడీపీ ప్రభుత్వం గతంలో కేసులు నమోదు చేయలేదని, జనసేనతో కలిసి పోలీస్ స్టేషన్ల వద్ద ఎలాంటి ఆందోళనలకు పాల్పడలేదని నాని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ తమపై రావణ్ విమర్శలు చేసినప్పటికీ వాటిని అణచివేయలేదని చెప్పారు.
ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపే వారిని కొత్త చట్టాల పేరుతో జైలుకు పంపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు కొడాలి నాని. ప్రజల గొంతును నొక్కివేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. తమ పార్టీని “గొడ్డలి పార్టీ” అని వ్యాఖ్యానిస్తున్న చంద్రబాబుకు రాజకీయంగా రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. తనకు నచ్చని వ్యక్తులను పోలీస్ స్టేషన్లలో తగలబెట్టించే పార్టీగా టీడీపీపై ప్రజల్లో “బూడిద పార్టీ” అనే అభిప్రాయం ఏర్పడుతోందని నాని వ్యాఖ్యానించారు. గత ఏడాదిగా పవన్ కల్యాణ్‌పై మాట్లాడుతుండటమే రావణ్ అరెస్టుకు కారణమని, జనసేన కక్షపూరితంగా కేసులు పెట్టి ఆయనను ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసిన తర్వాతే కొత్త చట్టాలను తీసుకొచ్చారని చెప్పారు. రావణ్‌ను వైసీపీ వ్యక్తిగా ప్రచారం చేస్తున్నది టీడీపీ అనుకూల వర్గాలేనని, ఎల్లో మీడియా అసత్య కథనాల ద్వారా ఈ వ్యవహారాన్ని వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని..
Also Read
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్‌గా భార్య ఎంట్రీ..!
- Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
- CM Chandrababu: స్టేజ్‌పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
తాజావార్తలు
-
Garuda Puranam: ఈ 5 రకాల వ్యక్తులతో స్నేహం చేస్తే జీవితమే నరకం.. గరుడ పురాణం హెచ్చరిక కూడా ఇదే!
-
Harish Rao: మెచ్చుకోవాల్సింది పోయి.. ఏంటి ఈ చిల్లర రాజకీయాలు.?
-
EPFO EPF Interest: పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. జూలై 15 నాటికి వడ్డీ జమ.. రూ.1.44 లక్షల కోట్లు క్రెడిట్!
-
Thaman: పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్‌కు ‘OG 2’ ఆల్బమ్ అంకితం
-
Maruthi : ‘రాజాసాబ్’ తర్వాత మొదటిసారిగా మీడియా ముందుకు మారుతి
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..