NTV Telugu Site icon

Ration Rice Case: పేర్ని నాని భార్య గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పురోగతి..

Prni Nani Case

Prni Nani Case

Ration Rice Case: మాజీ మంత్రి పేర్ని నాని భార్య గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పురోగతి లభించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న మానస తేజను మచిలీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోనే అతడ్ని అదుపులోకి తీసుకుని మచిలిపట్నంకు తరలిస్తున్నట్లు సమాచారం. అయితే, మానస తేజ విచారణ సందర్భంగా ఇచ్చే స్టేట్ మెంట్ కీలకం కానుందని పోలీసుల తెలిపారు. అతడి స్టేట్ మెంట్ ఆధారంగా మరి కొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉందని వెల్లడించారు.

Read Also: Tirumala Special Days 2025: జనవరి మాసంలో తిరుమలలో జరిగే విశేష పర్వదినాలు ఇవే..

కాగా, ఇప్పటికే గోడౌన్ లో 7,577 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్టు కేసు నమోదు చేశారు. అయితే, రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ ఏ1గా ఉన్నారు. ఆమె ముందస్తు బెయిలుపై రేపు తీర్పు ఇవ్వనున్న జిల్లా కోర్టు.. ఇక, ఇదే కేసులో పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టుకి నోటీసులు ఇచ్చిన హాజరుకాని పరిస్థితి నెలకొంది.

Show comments