Ambati Rambabu: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో అర్థం కాలేదు అని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. వంశీ టీడీపీ కార్యాలయ దాడి ఘటనలో బెయిలుపై ఉన్నారు.. ఆయన అరెస్టు పట్ల అందరం దిగ్భ్రాంతి చెందాం.. టీడీపీ దాడి ఘటనలో ఫిర్యాదు చేసిన వ్యక్తి మెజిస్ట్రేట్ వద్దకు వెళ్ళి తాను అసలు ఫిర్యాదు చేయలేదని చెప్పారు.. టీడీపీ వాళ్ళు దొంగ కేసు పెట్టించారని తెలుసుకున్నారు.. ఇది ఒక ఫాల్స్ కేసు అని ప్రపంచానికి తెలిసిందని ఆయన పేర్కొన్నారు. వెంటనే వాళ్ళ సోదరుడిని బెదిరించి మరో తప్పుడు కేసు పెట్టించారు.. వంశీ టీడీపీ నేతలను దూషించటం ఏంటని వాళ్ళు కక్ష్య కట్టారు.. ఎన్నోసార్లు న్యాయస్థానాలకు వెళ్లిన వంశీ బెయిలు తెచ్చుకోగలిగారు.. టీడీపీ వాళ్ళు పోలీసులతో కుమ్మక్కై ఇదంతా చేశారని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
Read Also: Lavanya: రాజ్ తరుణ్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి అని ఉంది!
ఇక, పోలీసులు వల్లభనేని వంశీని కలవకుండా అతడి భార్యను అనుమతించడం లేదని మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. మేము మా రిప్రెసెంటేషన్ ఇవ్వటానికి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాం.. టైం ఇచ్చిన డీజీపీ మమ్మల్ని కలవలేదన్నారు. అలాగే, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్ ని తిట్టి ఆయన మీదే కేసు పెట్టాలని చింతమనేని ప్రభాకర్ చూస్తున్నారని పేర్కొన్నారు. డ్రైవర్ ను చింతమనేని తిట్టిన వీడియోలు రాష్ట్రం మొత్తం చూశారు.. అయినా తిరిగి ఆయన మీదే కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.. టైం ఇచ్చిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మా రెప్రజెంటేషన్ తీసుకోకుండా వెళ్ళిపోయారు.. కార్యాలయంలో ఎవరినైనా మా రెప్రజెంటేషన్ తీసుకోమని కోరాం.. ఏ అధికారి కూడా మా రెప్రజెంటేషన్ తీసుకోలేదు.. పోలీసుల వ్యవహారం మరీ దుర్మార్గంగా ఉంది అని అంబటి రాంబాబు విమర్శించారు.
Read Also: JP Morgan Chase: లే ఆఫ్స్‌కి సిద్ధమైన JP మోర్గాన్ చేజ్..
అయితే, ప్రజాస్వామ్యంలో పోలీసులు ఇలా వ్యవహరించటం దారుణం అని మాజీమంత్రి అంబటి అన్నారు. వంశీని ఉదయం 6 గంటలకు అరెస్టు రాత్రిలోపు కోర్టుకు హాజరు పరచాలి.. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఇలాంటి పరిస్థితి ఉండటం దారుణం.. వంశీ అంశంపై గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసే ప్రయత్నం చేస్తాం.. అందరి లెక్కలు సరైన సమయంలో సరి చేస్తాం.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పద్దతి కరెక్ట్ కాదు అని అంబటి రాంబాబు వెల్లడించారు.