అనునిత్యం సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉండే రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మరో మారు వార్తల్లోకి ఎక్కింది. తన మాజీ బాయ్ ఫ్రెండ్ రాజ్ తరుణ్ ని క్షమాపణ కోరుతున్నానని ఆమె పేర్కొంది. నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించాడు అని.. చెప్పుడు మాటలు విని ఆవేశంలో రాజ్ తరుణ్ పై కేసు పెట్టానని ఆమె పేర్కొన్నారు. ఇక వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటున్నాను అని పేర్కొన్న ఆమె నా పోరాటం ఇకపై మస్తాన్ సాయి పై చేస్తానని ప్రకటించింది. ఇక తన వలన ఇబ్బంది పడ్డ రాజ్ తరుణ్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి అని ఉంది అని ఆమె అంన్నారు.
Kangana Ranaut Cafe: ప్రేమికుల దినోత్సవం రోజున కంగనా సొంత రెస్టారెంట్ ఓపెనింగ్
రాజ్ తరుణ్ పేరెంట్స్ కి కూడా క్షమాపణలు చెప్పింది లావణ్య. ఇక తాను బతికి ఉంటానో లేదో తెలియడం లేదని పేర్కొన్న ఆమె తనకు ప్రాణహాని ఉందని పేర్కొంది. నేను బతికి ఉండగానే రాజ్ తరుణ్ ఒక్క అవకాశం ఇస్తే క్షమాపణ చెప్పాలి అని ఉంది అంటూ ఆమె చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి కడుపు చేసి, అబార్షన్ చేయించి తప్పించుకు తిరుగుతున్నాడని తనకు తిండి పెట్టడానికి కూడా డబ్బులు ఇవ్వడం లేదని, 15 కుక్కలను తన మీద వదిలేశాడని చెబుతూ ఫిర్యాదు చేసింది. లావణ్య తన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు సబ్మిట్ చేయగా పోలీసులు వీరు ఇరువురూ కలిసి కొన్నాళ్ళు ఉన్నారని పోలీసులు గుర్తించారు.