Kodali Nani: గుడివాడలో ప్రత్యక్షమైన కొడాలి నాని.. ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు..!
- సుదీర్ఘ విరామం తర్వాత గుడివాడలో ప్రత్యక్షమైన కొడాలి నాని..
- ఓ కేసులో ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు హాజరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodali Nani: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొడాలి నానిపై రకరకాల ప్రచారాలు సాగాయి.. చివరకు ఆయన్ను అరెస్ట్ చేశారని.. రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారనే పుకార్లు కూడా షికార్లు చేశాయి.. దాంట్లో నిజం లేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.. అయితే, సుదీర్ఘ విరామం తర్వాత గుడివాడలో ప్రత్యక్షమయ్యారు మాజీ మంత్రి కొడాలి నాని.. ఓ కేసులో ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు హాజరయ్యారు.. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి ఘటనలో కొడాలి నానిపై కేసు నమోదు కాగా.. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు కొడాలి నాని.. అయితే, కింద కోర్టులో బెయిల్ తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో.. ష్యూరిటీ పత్రాలు సమర్పించేందుకు ఇవాళ గుడివాడ కోర్టుకు హాజరయ్యారు కొడాలి నాని..
Read Also: Konda Vishweshwar Reddy: కేసీఆర్ కుటుంబంపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
- Vallabhaneni Vamsi vs Yarlagadda Venkatrao: ఎమ్మెల్యే యార్లగడ్డకు వల్లభనేని లీగల్ నోటీసు
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Kodali Nani: రావణ్ వ్యవహారంపై మళ్లీ స్పందించిన కొడాలి నాని.. ఘాటు వ్యాఖ్యలు..
అయితే, ఈ కేసులో బెయిల్‌పై ఇప్పటికే 16 మంది కొడాలి నాని అనుచరులు విడుదలయ్యారు.. అయితే, పోలీసు కస్టడీలో కొడాలి నాని చెబితేనే దాడి చేసినట్లు అంగీకరించారట పలువురు అనుచరులు.. ఇక, చాలా కాలం తర్వాత గుడివాడలో కనిపించారు కొడాలి నాని.. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏడాది తర్వాత గుడివాడలో బహిరంగంగా కొడాలి నాని కనిపించడం ఇదే తొలిసారి అంటున్నారు.. ఇక, కొడాలి నాని రాకతో కోర్టు వద్దకు చేరుకున్నారు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు..
తాజావార్తలు
-
Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
-
Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్‌పై రూ.17 వేలు తగ్గింపు..
-
Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్’కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
-
Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
-
IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!