CM Chandrababu: కృష్ణా జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్టేజ్‌పైనే గట్టిగా క్లాస్ పీకారు. వివిధ శాఖల పనితీరుపై ప్రజలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను ప్రత్యక్షంగా వేదికపై చదివి వినిపించారు. ప్రజల అభిప్రాయాలను ఆధారంగా తీసుకుని అధికారుల పనితీరును సమీక్షించడం ప్రత్యేకంగా నిలిచింది. రేషన్, ఆర్ అండ్ బీ, ఆర్టీసీ, పోలీస్, ఆర్టీఐ వంటి కీలక శాఖల అధికారుల పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలందించడంలో నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. పనితీరు మెరుగుపరచకపోతే ఆ పదవుల్లో కొనసాగలేరని కఠినంగా హెచ్చరించారు.
Read Also: Beetroot Rice Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! హెల్తీ బీట్‌రూట్ పులావ్ తయారు చేయండిలా..
పనితీరు ఒక్కటే కొలమానం అని, ఇతర అంశాలకు ప్రాధాన్యం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రతి అధికారికి బాధ్యత అని గుర్తు చేశారు. అలాగే, పనితీరును ఎన్ని రోజుల్లోగా మెరుగుపరుస్తారో వేదికపైనే అధికారులతో చెప్పించారు. ఇక, మంచి పనితీరు కనబరిచిన అధికారులను కూడా సీఎం ప్రశ్నించి, వారు తీసుకున్న చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. మంచి పనిని గుర్తిస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. మొత్తంగా, ఈ కార్యక్రమం ద్వారా అధికారులకు కఠిన సందేశం ఇచ్చిన సీఎం చంద్రబాబు, ప్రజల సేవలో మరింత చురుకుదనం అవసరమని స్పష్టం చేశారు.
