Site icon NTV Telugu

Perni Nani: పులివెందులలోని అరాచకాలు పోలీసులకు కనిపించడం లేదా..?

Perni Nani

Perni Nani

Perni Nani: కడప జిల్లా పులివెందులలో జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అరాచకాలు, ఆకృత్యాలు జరుగుతున్న పోలీసులకు పట్టడం లేదని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని విమర్శించారు. పోలీసులు ఉద్యోగం చేయడం మానేశారు.. కర్నూల్ డీఐజీ అయితే, వైసీపీ నాయకులు పత్తి వ్యాపారం చేయడం వలన కడప ఎన్నికలలో అరాచకాలు జరిగిందడం బాధాకరం.. నామినేషన్ రోజు ఎవరైతే ఉన్నారో వాళ్లే రిపీటెడ్ గా గొడవల్లో పాల్గొంటున్నారు అని డీఐజీ అంటున్నారు.. కొంతమంది పోలీసులు కడప జిల్లా పులివెందులలో ఉద్యోగాలు చేయకుండా పత్తి వ్యాపారం చేయడం వల్లనే గొడవలు జరుగుతున్నాయని పేర్నినాని ఆరోపించారు.

Read Also: Google AI Pro: ఫ్రీ.. ఫ్రీ.. విద్యార్థులకు శుభవార్త.. ఏడాదిపాటు గూగుల్ AI ప్రో ప్లాన్ ఉచితం.. కాకపోతే!

అయితే, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ , వేల్పుల రాము ప్లాన్ ప్రకారం అయితే తలలు తెగిపోవాలని మాజీమంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు.. కానీ, పోలీస్ గ్యారెంటీ అవార్డ్స్, పీపీఎంఎస్, పీపీజీఏ, రాష్ట్రపతి ఉన్నతమైన సేవలు అందించే అవార్డులను.. ఎమ్మెల్సీ రమేష్, వేల్పూర్ రాములకి ఇవ్వాలని రాష్ట్రపతిని ఆయన కోరారు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులకు రాజకీయ శుక్లాలు వచ్చాయి.. అధికారం కోల్పోతే రాజకీయ శుక్లాలు పోతాయి.. దాని కోసం ఒక మూడున్నర సంవత్సరాలు వేచి ఉండాలని పేర్నినాని సూచించారు.

Exit mobile version