NTV Telugu Site icon

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కేసు విచారణ ముమ్మరం చేసిన ఏపీ పోలీసులు..

Vallabaneni

Vallabaneni

Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసులో విచారణను ఏపీ పోలీసులు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న ఏడుగురు నిందితుల కోసం హైదరాబాద్, విశాఖ పట్నంకు ఏపీ పోలీస్ ప్రత్యేక బృందాలు వెళ్లాయి. నిందితులు ఉపయోగించిన రెండు కార్లు గుర్తించే పనిలో పడ్డారు పోలిసులు. అయితే, పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. నిందితుల ఫోన్ కాల్స్ ను క్రొడీక్రిస్తున్నారు. విజయవాడ- హైదరాబాద్, విజయవాడ- విశాఖ మార్గాల్లో టోల్ ప్లాజాలో నిందితుల యొక్క కార్ల రాకపోకలను గుర్తించడం కోసం సీసీ టీవీ ఫుటేజ్ విజువల్స్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు, వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్ పై రేపు (ఫిబ్రవరి 17) విచారణ జరగనుంది.

Read Also: POCO X6 Neo 5G: క్రేజీ ఆఫర్.. రూ. 20 వేల స్మార్ట్ ఫోన్ రూ. 11 వేలకే

అయితే, టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడిగా ఉన్న సత్యవర్థన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో వల్లభనేని వంశీకి 14 రోజలు పాటు రిమాండ్ విధించింది విజయవాడలోని అదనపు కోర్టు. దీంతో ఈ కేసులో వేగంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో కేసులో కీలకంగా మారిన వంశీ ఫోన్ తో పాటు మిగతా నిందితుల కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి.