Site icon NTV Telugu

Krishna District: యువతితో అసభ్య నృత్యాలు.. హోంగార్డు సస్పెండ్!

Krishna District Home Guard

Krishna District Home Guard

అసభ్య ప్రవర్తన కలిగిన హోంగార్డును కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విధుల నుంచి తప్పించారు. హోంగార్డు 304 బీ.అజయ్ కుమార్ అసభ్య నృత్యాలు చేస్తూ అనుచిత ప్రవర్తన కలిగి పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడంతో.. సదరు హోంగార్డుపై క్రమశిక్షణ చర్యలకు జిల్లా ఎస్పీ ఉపక్రమించారు. ప్రజారక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ విధుల్లో పాల్గొనవలసిన హోంగార్డ్ అసభ్య నృత్యాలు చేస్తూ ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల వేదికగా విస్తృతంగా వ్యాపించడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. వాటిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించవలసిందిగా ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read: Kolusu Partha Sarathy: 5 లక్షల ఇళ్లులు ఉగాదికి పంపిణీ చేస్తాం!

వీడియోల ద్వారా ప్రచురితమవుతున్న వార్త నిజ నిర్ధారణ కావడంతో ఈరోజు హోంగార్డు అజయ్ కుమార్‌ను విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి పోలీస్ సిబ్బంది, అధికారుల ప్రవర్తన పోలీస్ శాఖ యొక్క ప్రతిష్టను పెంచేలా ఉంచాలి గానీ అప్రతిష్టకు గురి చేసేలా ఎవరు వ్యవహరించినా వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడేది లేదని ఎస్పీ హెచ్చరించారు. మంచి విధి నిర్వహణ కనపరిస్తే ఏ విధంగా అభినందిస్తామో, అలాగే విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంతే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ హెచ్చరించారు.

Exit mobile version