Bengaluru Police Arrested Three Men For Robbery In AP Police Dress: ఆ ముఠాలో మొత్తం ముగ్గురు ఉన్నారు. చెడు వ్యసనాలకు అలవాటుపడ్డ వీళ్లు.. డబ్బులు సంపాదించడానికి దోపిడీ మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రజలకు టోకరా వేసి.. ఏకంగా రూ. 80 లక్షలు దోచేసుకున్నారు. అదికూడా తాము పోలీసులమని అబద్ధం చెప్పి, ఈ దోపిడీకి పాల్పడ్డారు. చివరికి వీరి పప్పులు ఉడకపోవడంతో.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Inorbit Mall: అటు వెళ్లకండి.. వెళ్తే మాత్రం ఇరుక్కుంటారు జాగ్రత్త
ఆ ముగ్గురు దుండుగల పేర్లు.. బత్తుల శివరామకృష్ణ యాదవ్ (19), షేక్ చెంపతి లాల్ బాషా, షేక్ చెంపతి జాకిర్(27). ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వీళ్లు.. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. తమ అవసరాల కోసం డబ్బులు సంపాదించడానికి.. దోపిడీ మార్గాన్ని ఎంచుకున్నారు. ఎన్నో దోపిడీలు, దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే వీళ్లు ఇటీవల కుమారస్వామి, చందన్ అనే ఇద్దరు వ్యాపారుల్ని బెదిరించి.. వారి వద్ద నుంచిరూ. 80 లక్షలు దోచుకున్నారు. ఏపీ పోలీసుల తరహాలో దుస్తులు ధరించి బెదిరించడంతో.. ఆ వ్యాపారులు భయపడిపోయి డబ్బులు ఇచ్చేశారు. అనంతరం ఆ వ్యాపారులు పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ ముగ్గురిని చిత్తూరు జిల్లాలో అరెస్ట్ చేశారు.
Space Debris: ఆకాశంలో ‘చెత్త’.. ప్రపంచదేశాలకు సవాల్
ఈ కేసు వివరాల్ని డీసీపీ శ్రీనివాస్ గౌడ వెల్లడిస్తూ.. పోలీసుల దుస్తులు ధరించి, ఆ వ్యాపారుల నుంచి ఈ దుండగులు రూ. 80 లక్షలు జప్తు చేసుకున్నారన్నారు. దోచుకున్న నగదుతో బెంగళూరు మెజెస్టిక్ సమీపంలోని ఒక హోటల్‌లో జూదం ఆడారు. తొలుత రూ.కోటి గెల్చుకున్న వీళ్లు.. కొద్ది గంటల్లోనే ఆ నగదును ఓడిపోయారు. మిగిలిన నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు. చిత్తూరులో ఉన్నారని సమాచారం తెలిసి, అక్కడ అరెస్ట్ చేశామన్నారు. వీరిపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో దారి దోపిడీలు, దొంగతనాలు, ఎర్రచందనం తరలింపు తదితర 80కుపైగా కేసులు ఉన్నాయని తాము గుర్తించామన్నారు.
Divyansha Kaushik: ఐ లవ్ నాగచైతన్య.. బాంబ్ పేల్చిన ‘మజిలీ’ బ్యూటీ