Site icon NTV Telugu

Kodali Nani: అంత మంచి కుటుంబంలో పుట్టి.. చంద్రబాబు భజనెందుకు పవన్?

Kodali Nani

Kodali Nani

Kodali Nani: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డాడని జగన్‌పై చంద్రబాబు ఎంత ప్రచారం చేసినా ప్రజలు నమ్మకుండా అధికారాన్ని కట్టబెట్టారని.. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే పప్పు నాయుడు చంద్రబాబు అని కొడాలి నాని ఆరోపించారు. అటు పప్పు నాయుడు కుమారుడు తుప్పు నాయుడు మంగళవారం మాటలు మాట్లాడుతున్నాడని.. వారంలో ఏదో జగన్ వ్యవహారం బయటపెడతానని వాగుతున్నాడని.. అదేదో మొన్న మంగళవారమే ఉత్తర కుమారుడు బయటపెట్టవచ్చు కదా అని కొడాలి నాని నిలదీశారు. అటు చిరంజీవి లాంటి మంచి వ్యక్తి కుటుంబంలో పుట్టి పవన్ కళ్యాణ్‌కు ఎందుకింత కర్మ అని కొడాలి నాని ప్రశ్నించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదువుతూ పవన్ దిగజారిపోయాడని విమర్శించారు.

Read Also: Naga Babu: అన్నయ్య బర్త్ డే రోజు.. ఆయనకే తెలియని విషయం చెప్తా..!!

రెండు చోట్ల ఓడిపోయినా పవన్ కళ్యాణ్‌కు ఇంకా సిగ్గు రాలేదని.. ఇంకా చంద్రబాబు భజన చేస్తున్నాడని.. జగన్‌ను దించేయాలని తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇసుక పేరుతో డబ్బులు దోచుకుంటున్నానని తప్పుడు ఆరోపణలు చేయడం పవన్‌కు తగదు అని సూచించారు. పవన్‌కళ్యాణ్‌కు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానని.. ఆయన గుడివాడకు వచ్చిన తనకు ఐదు లారీలు ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. గత ప్రభుత్వంలో ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పి నేతలు, మీడియా సంస్థలు ప్రజల సొమ్మును దోచుకున్నాయని.. తమ ప్రభుత్వం టెండర్లు కట్టబెట్టి ఇసుకను విక్రయించి గత ఐదేళ్లలో 4వేల కోట్ల నిధులను సమీకరించిందని కొడాలి నాని వివరించారు. 150 ట్రక్కులు తనవే అని పవన్ ఎలా చెప్తాడని ప్రశ్నించారు. అటు గుడివాడలో క్యాసినో జరగలేదని.. కానీ చికోటి ప్రవీణ్‌పై ఈడీ దాడులు చేయాలని రాజకీయ ప్రత్యర్థులు ఒత్తిడి చేస్తున్నారని.. ఈ వ్యవహారంలోకి తనను లాగాలని ప్రయత్నిస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. పనికిమాలిన వీడియోలపై మాట్లాడేందుకు గ్రీష్మ, అనిత లాంటి మహిళా నేతలు ఎందుకని టీడీపీని నిలదీశారు. ఫేక్ వీడియోతో మాధవ్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Exit mobile version