టీడీపీకి ఇంగిత జ్ఞానం లేదు.. క్యాసినోపై బైడెన్‌కు ఫిర్యాదు చేస్తారేమో?: కొడాలి నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై మరోసారి మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన మంత్రి కొడాలి నాని అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా కృష్ణా జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే అభినందించాల్సింది పోయి ఇంగిత జ్ఞానం లేకుండా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. టీడీపీ ఓ దిక్కుమాలిన పార్టీ అని… డబ్బా పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2014 నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిందేమీ లేకపోయినా ఆయన డబ్బా మీడియా వివిధ రకాలుగా ప్రచారం చేసినా ప్రజలు అవేవీ నమ్మకుండా టీడీపీకి తగిన బుద్ధి చెప్పారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. రాజకీయ పరంగా ఎన్టీఆర్, వైఎస్ఆర్ మధ్య వైరం ఉన్నా తమ సీఎం జగన్ అవేమీ పట్టించుకోకుండా తెలుగు ప్రజల కోసం ఎన్నో సేవలు చేసిన ఎన్టీఆర్‌ను స్మరించుకునేందుకు కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని వివరించారు. వైఎస్ఆర్ ఆశయాలనే కాకుండా ఎన్టీఆర్ చేసిన సేవలను జగన్ ఆదర్శంగా తీసుకుని పాలన సాగిస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్, ఎన్టీఆర్లనే కాకుండా అంబేద్కర్, జగ్జీవన్‌రామ్, వంగవీటి రంగా వంటి ఎందరో ప్రముఖుల బాటలో జగన్ నడుస్తున్నారన్నారు.
Also Read
అటు గుడివాడలో మూడు రోజులు క్యాసినో జరిగితే.. 362 రోజులు టీడీపీ చీర్ బాయ్స్ ప్రచారం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. టీడీపీ నేతలకు జీవితకాలం టైం ఇస్తున్నానని… వారికి చేతనైంది చేసుకోవాలని సవాల్ విసిరారు. మూడు రోజుల క్యాసినోకు రూ.500 కోట్లు వస్తే మరి 50 క్యాసినోలు ఉన్న గోవాలో ఎన్ని వేల కోట్లు రావాలని కొడాలి నాని ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు ఈ వ్యవహారంపై త్వరలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కూడా ఫిర్యాదు చేస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!