టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై మరోసారి మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన మంత్రి కొడాలి నాని అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా కృష్ణా జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే అభినందించాల్సింది పోయి ఇంగిత జ్ఞానం లేకుండా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. టీడీపీ ఓ దిక్కుమాలిన పార్టీ అని… డబ్బా పార్టీ అని…