Site icon NTV Telugu

Kolleru: కొల్లేరు సరిహద్దులపై మరోసారి పరిశీలన జరపాలని సుప్రీం ఆదేశం..

Supremi

Supremi

Kolleru: కొల్లేరుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యంపై మరోసారి తనిఖీ జరపాలని “కేంద్ర సాధికార కమిటీ”కి జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే, కొల్లేరులో ప్రైవేటు భూములను నోటిఫై చేయడంపై సుప్రీంకోర్టును ప్రైవేటు మత్స్యకారులు సంఘం ఆశ్రయించిన విషయం విధితమే. ఇక, కొల్లేరు ప్రస్తుత స్థితిపై నివేదిక అందించాలని “సీఈసీ” కి ఆదేశాలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను “ఏపీ వెట్ ల్యాండ్ స్టేట్ అథారిటీ” సరిగ్గా అమలు చేస్తుందో, లేదో నివేదిక ఇవ్వాలి అని జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం సూచించింది.

Read Also: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేసిన ప్రభాకర్ రావు

అయితే, కొల్లేరు సరిహద్దులను పరిశీలించాలి అని “నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు స్టాండింగ్ కమిటీ” తీర్మానాలను, కొల్లేరు సరిహద్దులపై ఆర్ సుకుమార్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి సమస్యను పరిష్కరించాలి అని సుప్రీంకోర్టు తెలిపింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టంకు అనుగుణంగానే కొల్లేరులో వన్యప్రాణుల అభయారణ్యం నోటిఫై చేశారా? అని ప్రశ్నించింది. కొల్లేరులో ఉన్న ప్రైవేటు భూ యజమానుల హక్కులను ఎలా సెటిల్ చేశారు? అని అడిగింది. దీనిపై 12 వారాల్లోగా సుప్రీంకోర్టుకు తుది నివేదికను అందజేయాలని ఆదేశాలు ఇచ్చింది.

Exit mobile version