Kethireddy Peddareddy: జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ ప్రభాకర్ తన కుమారుడ్ని ఎమ్మెల్యే చేసుకునేందుకు.. జేసీ దివాకర్ రెడ్డిని చంపాలని అనుకుంటున్నారని షాకింగ్ ఆరోపణలు చేశారు. బెడ్‌పై ఉన్న ఆయన సోదరిని సైతం చంపాలనుకున్నాడని బాంబ్ పేల్చారు. ఇప్పుడు దివాకర్‌రెడ్డిని చంపి, ఆ సానుభూతి తాను పొందాలని ప్రభాకర్ భావిస్తున్నాడని పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి టిక్కెట్ జేసీ ప్రభాకర్ రెడ్డికి వచ్చే అవకాశాలు లేవని.. ఉనికి కోసం ఆయన పాకులాడుతున్నాడని పేర్కొన్నారు. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇప్పటికే మతిస్థిమితం కోల్పోయారన్నారు. త్వరలో జేసీ ప్రభాకర్ రెడ్డికి కూడా ఆ జబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తాడిపత్రి హైస్కూల్‌లో నాడు – నేడు పనులను జేసీ అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. హైస్కూల్ మైదానంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైస్కూల్ కాంపౌండ్ వాల్ కడితే.. తన కార్యకలాపాలు సాగవని జేసీ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
Vivo T1X Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ డిస్కౌంట్.. రూ.12999కే వివో టీ1ఎక్స్ స్మార్ట్‌ఫోన్!
అంతకుముందు.. తాడిపత్రి మున్సిపాలిటీని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దోచుకుంటున్నారని టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మార్కెట్‌లో షాపులను కేతిరెడ్డి మనుషులకు ఇచ్చారని, టీడీపీ నుంచి గెలిచిన కౌన్సిలర్ రాబర్ట్‌ను వైసీపీలో చేర్చుకున్నారనిఅన్నారు. రాబర్ట్‌కు మున్సిపల్ స్థలాన్ని కట్టబెట్టి, బిర్యానీ సెంటర్ పెట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. మున్సిపాలిటీ స్థలాన్ని పోలీస్ స్టేషన్ కోసం తీసుకున్నారని.. అక్కడ పోలీస్ స్టేషన్‌ను నిర్మిస్తే ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని తెలిపారు. వైసీపీ చెప్పినట్టే జిల్లా ఎస్పీ చేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. తన మాటల్ని ఎస్పీని బాధపెట్టొచ్చని, అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలను ఎవరికి భయపడి సీజ్ చేయడం లేదని ప్రశ్నించారు. తాను తాడిపత్రి కోసం ప్రాణమిస్తానన్న జేసీ ప్రభాకర్.. తాడిపత్రి అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు ఇస్తే, మున్సిపల్ ఛైర్మన్‌గా తాను రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు.
MLA Sanjay Kumar: బీఆర్ఎస్ తో తెలంగాణ మారింది.. జగిత్యాల ఎమ్మెల్యే కామెంట్స్