Site icon NTV Telugu

MP Kesineni Nani Vs Kesineni Chinni : ఇది చిల్లర వివాదం.. నాని నా శత్రువు కాదు.. సొంత అన్న..

Kesineni Chinni

Kesineni Chinni

టీడీపీలో సీనియర్‌ నేతలుగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు కేశినేని చిన్ని మధ్య వివాదం రచ్చగా మారింది.. సొంత తమ్ముడు చిన్నిపై కేశినేని నాని ఫిర్యాదు చేయడంతో వారి మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా గుప్పుమన్నట్టు అయ్యింది.. ఇక, తనపై సోదరుడు నాని కేసు పెట్టడంపై స్పందించారు కేశినేని చిన్ని.. ఓ చిల్లర వివాదంలోకి ఎంపీ కేశినేని నాని నా కుటుంబాన్ని లాగడం బాధాకరమన్న ఆయన.. ఆ స్టిక్కర్ ఎవరిదో ఏంటో విచారణలో తేలనివ్వండి అన్నారు.. హైదరాబాద్‌లో పోలీసులు ఆపారు.. పోలీస్ కమిషనర్ ఆఫీసుకు తీసుకెళ్లారు.. ఎంక్వైరీ చేశారు.. మళ్లీ కారును పంపించారని తెలిపారు.. నేను ఓ చిన్న కార్యకర్తను.. చంద్రబాబు సీఎం కావడమే మా లక్ష్యంగా పేర్కొన్న ఆయనే.. ఆటోనగర్‌లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవం జరపాలని భావించాను.. కానీ, దానిని కూడా వివాదాల్లోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Kesineni Nani vs Kesineni Chinni: రచ్చకెక్కిన కేశినేని ఫ్యామిలీ..! సోదరుడిపై ఫిర్యాదు

ఇక, నాని మా శత్రువు కాదు.. మా సొంత అనే విషయాన్ని మర్చిపోవద్దు అన్నారు చిన్ని.. నేను ఓ చిన్న కార్యకర్తను.. నేను ఎంపీగా పోటీ చేస్తానని చెప్పలేదు.. టికెట్‌ కూడా అడగలేదని స్పష్టం చేశారు.. పార్టీ అధినేత చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానన్న ఆయన.. నేను ఏ తప్పు చేసినా ఈపాటికే బయటకొచ్చేదిగా..? అని ఎదురుప్రశ్నించారు.. రెండు నెలల నుంచి మాత్రమే వ్యాపారవేత్తలను బెదిరిస్తున్నన్నా..? ఇప్పుడే కంప్లైంట్ ఎందుకొచ్చింది..? అని ప్రశ్నించిన చిన్ని.. ప్రస్తుతం నా కారుపై ఎలాంటి స్టిక్కర్ లేదన్నారు.. హైదరాబాద్ పోలీసులు నా కారు విషయంలో క్లీన్ చిట్ ఇచ్చారని.. నా పై ఫిర్యాదు వ్యక్తిగత వ్యవహరమే కానీ.. రాజకీయపరమైన కారణం కాదని చెప్పుకొచ్చారు.. నాపై రాజకీయంగా విమర్శ చేయొచ్చు.. కానీ, ఇంట్లో ఆడవాళ్లను బయటకు లాగడం సరికాదని హితవుపలికారు.. పార్టీ ఆదేశిస్తే.. కేశినేని నాని గెలుపు కోసం పని చేస్తానని ప్రకటించారు కేశినేని చిన్ని.

Exit mobile version