NTV Telugu Site icon

Karumuri Nageswara Rao: పెళ్ళికి, పేరంటానికి తేడా తెలియని వ్యక్తి పవన్.. మంత్రి కారుమూరి ధ్వజం

Karumuri Nageswara Rao

Karumuri Nageswara Rao

Karumuri Nageswara Rao Sensational Comments On Pawan Kalyan: జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు స్క్రిప్టులను చదివే పవన్ గురించి తాను మాట్లాడనని అన్నారు. శ్రార్ధానికి – తద్దినానికి, పెళ్ళికి – పేరంటానికి తేడా తెలియని వ్యక్తి పవన్ అని ఎద్దేవా చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలతో వాలంటీర్ల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టే ఆయనపై కేసులు వేస్తున్నారని తెలిపారు. ఈ కాలంలో మనం చాలాచోట్ల మన వివరాలను ఇస్తున్నామని.. పవన్ ముందుకు వెళ్తున్నాడా? వెనక్కి వెళ్తున్నాడా? అర్థం కావడం లేదని విమర్శించారు. జగన్, కారుమూరి వివరాలు కావాలన్నా.. చిన్న క్లిక్‌తో వస్తాయన్నారు. గజదొంగలు అనే పదం టీడీపీ నేతలకే వర్తిస్తుందని ధ్వజమెత్తారు. ఆలీబాబా చంద్రబాబు, నలభై దొంగల లోకేష్‌తో కలిపి.. వాళ్ళే గాదె కింద పందికొక్కుల్లా తిన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లటమే మీ పనా? అని ప్రశ్నించారు. చంద్రబాబు సమావేశాలు పెడితే ఏమీ జరిగేది కాదని.. కానీ జగన్ సమావేశం పెడితే ఒక సంక్షేమం జరుగుతుందని పేర్కొన్నారు. ఏపీలో ఇప్పుడు ధనికులు ఎక్కువయ్యారన్నారు.

Thota Trimurthulu: మిథున్ రెడ్డి దృష్టికి తోట త్రిమూర్తులు తీసుకెళ్లిన కీలక విషయాలు

ఇదే సమయంలో.. ఇంటింటికి రేషన్ వాహనాలు ఉన్నప్పటికీ కూడా‌ డీలర్లను తీసేయడం జరగదని మంత్రి కారుమూరి స్పష్టం చేశారు. ఫోర్టిఫైడ్ బియ్యాన్ని న్యూట్రిషన్ విలువలతో ఇస్తున్నామని అన్నారు. ఫోర్టిఫైడ్ రైస్ ప్లాస్టిక్‌లా కనిపిస్తుందనేది ఒక అపోహ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. 322 షాపులు బియ్యం, 246 షాపులు కందిపప్పు సబ్సిడీ ధరలకు అమ్మకానికి పెట్టామన్నారు. ఎక్కడైనా రేషన్ వాహనాలు నడవకపోతే డీలర్లతోనే నడిపిస్తామే తప్ప ఆపమని తెలిపారు. తూకం వేసి బియ్యం రేషన్ డీలర్లకు ఇవ్వడం జరుగుతుందన్నారు. గోడౌన్ దగ్గరే షాపు ఉండేలా కట్టివ్వడానికి సిద్ధం చేస్తున్నామన్నారు. NREGS నిధులతో ఈ గోడౌన్‌లు నిర్మిస్తామని.. డీలర్ల మార్జిన్ పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 2012 నుంచి అంగన్వాడీలకు, మధ్యాహ్న భోజన పథకాలకు ఇవ్వాల్సిన కమీషన్లు ఇంకా బాకీ ఉన్నాయని.. అవి ఇచ్చేస్తున్నామని తెలియజేశారు. కేరళ మాదిరిగా ఇన్స్యూరెన్స్, LOC ఇచ్చేలా సిద్ధం చేస్తున్నామన్నారు. BPLలో ఉన్న డీలర్లందరికీ సదుపాయాలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. బియ్యం బస్తాలు తిరిగి ఇచ్చేయడంపై సీఎంతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కరోనా సమయంలో చనిపోయిన డీలర్లకు లక్ష రూపాయల చొప్పున ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నామని మంత్రి కారుమూరి వెల్లడించారు.

Cinema: సినిమాటోగ్రఫర్- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మధ్య తేడా ఏంటో తెలుసా?