రేషనుకు నగదు బదిలీపై సోము వీర్రాజు వ్యాఖ్యలు అర్థరహితం అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. 2017లో కేంద్రం తెచ్చిన పథకాన్నే ఏపీలో అమలుచేస్తున్నాం. సోము వీర్రాజు పథకం గురించి ప్రధాని మోడీని అడగాలి. రేషన్ బియ్యానికి నగదు చెల్లింపుల పథకాన్ని విమర్శించడమంటే మోడీని విమర్శించినట్లే అన్నారు.
రేషన్ బియ్యానికి నగదు బదిలీపై ఎలాంటి ఒత్తిడి లేదు. బలవంతంగా ఎవరి మీదా నగదు బదిలీ అమలు చేసేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై కావాలనే సోము వీర్రాజు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడిగా ఉండి సోము వీర్రాజు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. కొంతమంది బియ్యం బదులు వేరే ఆహారం తీసుకుంటున్నారు. గ్రామంలో ఎంత మంది ఇష్టపడితే అంతమందికి మాత్రమే ఇస్తాం. కార్డులు పోతాయని ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నారు. జూన్ నెలలో కొత్తగా రేషన్ కార్డులు జారీ చేస్తాం అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.
Read Also: Somu Veerraju: నగదు బదిలీ పేరుతో వైసీపీ సర్కారు కొత్త నాటకం
