NTV Telugu Site icon

Road Accident: అమెరికాలో రోడ్డుప్రమాదం.. కర్నూలు జిల్లా యువతి మృతి

Telugu Girl

Telugu Girl

Road Accident: అమెరికాలోని సియాటిల్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోనీకి చెందిన కందుల జాహ్నవి అని పోలీసులు గుర్తించారు. వేగంగా వచ్చిన పోలీస్ కారు ఢీ కొట్టడంతో జాహ్నవికి తొలుత తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని యువతిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలింది. ఈమేరకు ప్రమాదం విషయాన్ని జాహ్నవి కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం అందించారు.

Read Also: Pakistan: పాకిస్తాన్ లో పెట్రోల్ కొరత.. బంకుల ముందు భారీ క్యూలు

కాగా సియాటిల్‌లో ఉంటున్న కందుల జాహ్నవి సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో థామస్ స్ట్రీట్‌లో నడుచుకుంటూ వెళుతోంది. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన పోలీస్ వాహనం ఆమెను ఢీ కొట్టింది. దీంతో జాహ్నవికి తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తుండగా జాహ్నవి మరణించింది. కాగా ఈ ప్రమాదానికి కారణమైన అధికారి 2019 నుంచి విధులు నిర్వహిస్తున్నాడని సియాటిల్ పోలీసులు చెప్పారు. అయితే నిందితుడి వివరాలను మాత్రం వారు బయటపెట్టలేదు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Show comments