SVSN Varma: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ఇప్పుడు కొత్త డిమాండ్ ఎత్తుకున్నారు.. గతంలో.. ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్‌కి కీలక బాధ్యతలు అప్పగిస్తే ఏంటి? లోకేష్‌ని డిప్యూటీ సీఎంను చేస్తే తప్పేంటి? అని ప్రశ్నించి కాకరేపిన వర్మ.. ఇప్పుడు.. పార్టీలో లోకేష్‌కి కీలక బాధ్యతలు ఇవ్వాలంటున్నారు.. టీడీపీకి లోకేష్ నాయకత్వం అవసరం అన్నారు వర్మ.. పార్టీకి 2047 ప్రణాళిక కావాలని అభిప్రాయపడ్డారు.. అయితే, పార్టీ రథసారథిగా నారా లోకేష్ ను నియమించేలా.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవాలని కోరారు. అంతేకాదు. లోకేష్ నిర్వహించిన యువ గళం పాదయాత్ర వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు వర్మ..
Read Also: UP: పెళ్లికి ముందు కాబోయే అత్తగారితో కలిసి అల్లుడు జంప్!
టీడీపీకి లోకేష్ నాయకత్వం అసరమన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ.. పార్టీకి 2047 ప్రణాళిక కావాలని కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో జరుగుతున్న ప్రజాదర్బార్ లో కోరారు.. పార్టీ రథ సారథిగా లోకేష్ ను నియమించేలా చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని.. అందుకు కార్యకర్తలు చేయి పైకెత్తి మద్దతు తెలపాలని కోరారు వర్మ.. కాగా, గతంలో నారా లోకేష్ డిప్యూటీ సీఎం పదవిపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం స్థానంలో చూడాలని టీడీపీ అనుచరులు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.. అయితే, వర్మతో పాటు మరికొందరు నేతలు ఈ డిమాండ్ తెరపైకి తేవడంతో కూటమిలో పెద్ద చర్చకు దారి తీసిన విషయం విదితమే..