Firecracker Factory Blast: బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. మంటల్లో 20 మంది కార్మికులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Firecracker Factory Blast: కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఉన్న క్రాకర్స్ తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్దాలతో పేలుడు చోటుచేసుకోవడంతో పరిసర ప్రాంతాలు వణికిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 20 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పేలుడు తీవ్రతకు భవనం ధ్వంసమై మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. పేలుడు ప్రభావంతో సమీపంలోని కొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తూ వివరాలు సేకరిస్తున్నారు.
Read Also: TTD Budget 2026: రూ.5,456 కోట్లతో టీటీడీ బడ్జెట్.. శ్రీవారి ఆదాయం ఎన్ని కోట్లు అంటే..!
Also Read
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
ప్రాథమిక సమాచారం ప్రకారం 20 మంది కార్మికులు మంటల్లో చిక్కుకోగా.. ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత వెల్లడికానున్నాయి. అయితే, మంటల్లో 20 మంది కార్మికులు చిక్కుకోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉందంటున్నారు..
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!