Dwarampudi Chandrasekhar Reddy: మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి బహిరంగ లేఖ..
- కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబుకి.. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి బహిరంగ లేఖ..
- కక్ష సాధింపు చర్యలు.. నిరాధారణ ఆరోపణలతో తప్పుడు కేసులు పెడుతున్నారు..
- ప్రశాంతంగా ఉండే కాకినాడలో రాజకీయ కక్షలు ప్రేరేపిస్తున్నారని లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dwarampudi Chandrasekhar Reddy: మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు గత కొంతకాలంగా హాట్ టాపిక్ అయిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వరుసగా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఫోకస్ పెట్టింది.. అక్రమ నిల్వలపై దాడి చేసి బయటపెట్టింది.. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై ఆరోపణలు వచ్చాయి.. అయితే, తనపై చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ కౌంటర్ ఎటాక్‌కు దిగారు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి.. ఈ మేరకు కాకినాడ ఎమ్మెల్యే కొండ బాబుకు బహిరంగ లేఖ రాశారు.. గత వారం రోజులుగా ఎస్పీ, కలెక్టర్ కి ద్వారంపూడి పై ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే కొండ బాబు.. అంతేకాదు. ఆయన అవినీతి పై విచారణ చేయాలని సీఎం చంద్రబాబును కలవడానికి సిద్ధమయ్యారు..
Also Read
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
ఈ మొత్తం ఎపిసోడ్ పై స్పందించారు ద్వారంపూడి.. కక్ష సాధింపు చర్యలు.. నిరాధారణ ఆరోపణలతో తప్పుడు కేసులు పెడుతున్నారని.. ప్రశాంతంగా ఉండే కాకినాడలో రాజకీయ కక్షలు ప్రేరేపించే విధంగా వ్యవరిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.. అధికారం ఉందని అహంకారంతో వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.. ఇదే సమయంలో.. చట్టబద్ధంగా కేసులు ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.. తాను ఎటువంటి బియ్యం వ్యాపారం చేయడం లేదని. మీ వల్ల 30 వేల మంది కార్మికులు నష్టపోతున్నారని మండిపడ్డారు. అధికారుల బదిలీలలో ఎంత అవినీతి జరిగిందో త్వరలోనే బయటపెడతానని.. ఆరు నెలల తర్వాత అవినీతి అక్రమాలపై స్పందిస్తానని కౌంటర్ ఎటాక్ దిగారు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి. మొత్తంగా ఇప్పుడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకి.. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాసిన బహిరంగ లేఖ చర్చగా మారింది.
తాజావార్తలు
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!