Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన వాయిదా పడింది. రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన ఈ పర్యటనను పార్టీ కార్యక్రమాల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలో టౌన్, వార్డు, బూత్ స్థాయి కమిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ సభ్యత్వం కలిగిన ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొని కమిటీలను ఎన్నుకోనున్నారు. ప్రత్యేంగా ఈసారి ఓటింగ్ ప్రక్రియ ద్వారా పార్టీ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు నామినేషన్ లేదా ఏకగ్రీవ పద్ధతిలో జరిగే ఎన్నికలకు భిన్నంగా, తొలిసారి సభ్యులే ప్రత్యక్షంగా తమ ప్రతినిధులను ఎన్నుకునే విధానాన్ని అమలు చేస్తున్నారు. రేపు నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించడంతోనే పవన్ కల్యాణ్ పర్యటనను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటనకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.
Read Also: Pradosha Vratam : మహాశివరాత్రికి ముందే అద్భుత అవకాశం.! ఈ శని ప్రదోషం రోజున ఇది చేస్తే చాలు.!