Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన వాయిదా పడింది. రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన ఈ పర్యటనను పార్టీ కార్యక్రమాల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలో టౌన్, వార్డు, బూత్ స్థాయి కమిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ సభ్యత్వం కలిగిన ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొని కమిటీలను ఎన్నుకోనున్నారు. ప్రత్యేంగా ఈసారి…