NTV Telugu Site icon

Pawan Kalyan: జులై 1 నుంచి కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన..

Pawan

Pawan

Pawan Kalyan: కాకినాడ జిల్లాలో పర్యటించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రెడి అయ్యారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయింది. జులై 1వ తేదీ నుంచి 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతుందని ప్రకటించారు. తొలి రోజు గొల్లప్రోలులో పెంచిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.. ఆ తర్వాత పిఠాపురం జనసేన నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అలాగే, జూలై 2వ తేదీన కాకినాడ కలెక్టరేట్ లో పంచాయతీరాజ్, ఇరిగేషన్, అటవీ శాఖ అధికారులతో సమీక్ష డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Read Also: Nadendla Manohar: పౌర సరఫరాల శాఖలో లోపాలు ఉన్నాయి.. సరిదిద్దుతాం..!

అలాగే, జులై 2వ తేదీన సాయంత్రం జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఇక, జులై 3న ఉదయం ఉప్పాడ కొత్తపల్లి సముద్ర ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం పిఠాపురంలో వారాహి కృతజ్ఞతా సభలో ఆయన ప్రసంగించనున్నారు. అయితే, ఇవాళ ( శనివారం ) పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలోని కొండగట్టు అంజన్నను దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు నిర్వహించి.. మొక్కులను చెల్లించుకున్నారు. కాగా, కొండగట్టుకు వెళ్తుండగా తెలంగాణలోని బీజేపీ- జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు ఘన స్వాగతం పలికారు.