NTV Telugu Site icon

Kakani Govardhan Reddy: ఏం జరిగినా.. వైసీపీకి ఆపాదించడం పరిపాటిగా మారింది

Kakani On Anam Issue

Kakani On Anam Issue

Kakani Govardhan Reddy Reacts On Anam Venkata Ramana Reddy Issue: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డిపై దాడికి జరిగిన యత్నంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఆ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని.. వైసీపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏం జరిగినా.. దాన్ని వైసీపీకి ఆపాదించడం పరిపాటిగా మారిందని ఫైర్ అయ్యారు. ఇక్కడున్న నటులు కాకుండా, కొందరు నటులను దిగుమతి చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. వాళ్లలో దేవినేని ఉమా ఒకరని, ఆయన నెల్లూరుకు వచ్చి హడావిడి చేశారని అన్నారు. గత ఎన్నికల్లో మంత్రి ఉన్న దేవినేని ఉమా ఓటమి పాలయ్యారని, ఆయన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. దాడికి యత్నం జరిగిందని చెబుతున్న ఆనం పోలీసులకు ఫిర్యాదు చేయనని చెప్పారని.. తాము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరిని ఏరిపారేస్తామని బెదిరించారని, ఎవరు రౌడీయిజం చేస్తున్నారనే దానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.

Sajjala Ramakrishna Reddy: అధికారం కోసం పొత్తులు పెట్టుకోవటంలో చంద్రబాబు సిద్ధహస్తుడు

ఆ దాడి వ్యవహారంలో పోలీసులు పలుమార్లు వెళ్తే.. రాత్రి సమయంలో ఆనం ఫిర్యాదు చేశారని కాకాణి తెలిపారు. పోలీసులు వెళ్లి అడిగితే కంప్లైంట్ ఇచ్చే దిక్కులేదని కౌంటర్ వేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. ఇలాంటి దాడులను ముఖ్యమంత్రి జగన్‌తో పాటు వైసీపీ నేతలు కూడా ప్రోత్సహించబోరని తెలిపారు. టీడీపీ నేతలు మాట్లాడుతున్న మాటలే పలు అనుమానాలకు దారి తీస్తున్నాయన్నారు. టీడీపీ నేతల వ్యవహార శైలి చూస్తుంటే.. బురదజల్లే ప్రయత్నానికి శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తోందన్నారు. లోకేష్ త్వరలో జిల్లాలో పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో.. సెన్సేషన్ కోసమే ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. లోకేష్ పాదయాత్ర అన్ని చోట్లా విఫలమైందన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన దేవినేని ఉమా.. వచ్చే ఎన్నికల ఫలితాల గురించి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు కుప్పంలో ఓడిపోతారని జోస్యం చెప్పారు.

Wives Eloped With Lovers: భర్తల్ని పని కోసం విదేశాలకు పంపి.. లవర్లతో భార్యలు జంప్

Show comments