Kakani Govardhan Reddy: ఏం జరిగినా.. వైసీపీకి ఆపాదించడం పరిపాటిగా మారింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy Reacts On Anam Venkata Ramana Reddy Issue: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డిపై దాడికి జరిగిన యత్నంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఆ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని.. వైసీపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏం జరిగినా.. దాన్ని వైసీపీకి ఆపాదించడం పరిపాటిగా మారిందని ఫైర్ అయ్యారు. ఇక్కడున్న నటులు కాకుండా, కొందరు నటులను దిగుమతి చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. వాళ్లలో దేవినేని ఉమా ఒకరని, ఆయన నెల్లూరుకు వచ్చి హడావిడి చేశారని అన్నారు. గత ఎన్నికల్లో మంత్రి ఉన్న దేవినేని ఉమా ఓటమి పాలయ్యారని, ఆయన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. దాడికి యత్నం జరిగిందని చెబుతున్న ఆనం పోలీసులకు ఫిర్యాదు చేయనని చెప్పారని.. తాము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరిని ఏరిపారేస్తామని బెదిరించారని, ఎవరు రౌడీయిజం చేస్తున్నారనే దానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.
Sajjala Ramakrishna Reddy: అధికారం కోసం పొత్తులు పెట్టుకోవటంలో చంద్రబాబు సిద్ధహస్తుడు
Also Read
ఆ దాడి వ్యవహారంలో పోలీసులు పలుమార్లు వెళ్తే.. రాత్రి సమయంలో ఆనం ఫిర్యాదు చేశారని కాకాణి తెలిపారు. పోలీసులు వెళ్లి అడిగితే కంప్లైంట్ ఇచ్చే దిక్కులేదని కౌంటర్ వేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. ఇలాంటి దాడులను ముఖ్యమంత్రి జగన్‌తో పాటు వైసీపీ నేతలు కూడా ప్రోత్సహించబోరని తెలిపారు. టీడీపీ నేతలు మాట్లాడుతున్న మాటలే పలు అనుమానాలకు దారి తీస్తున్నాయన్నారు. టీడీపీ నేతల వ్యవహార శైలి చూస్తుంటే.. బురదజల్లే ప్రయత్నానికి శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తోందన్నారు. లోకేష్ త్వరలో జిల్లాలో పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో.. సెన్సేషన్ కోసమే ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. లోకేష్ పాదయాత్ర అన్ని చోట్లా విఫలమైందన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన దేవినేని ఉమా.. వచ్చే ఎన్నికల ఫలితాల గురించి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు కుప్పంలో ఓడిపోతారని జోస్యం చెప్పారు.
Wives Eloped With Lovers: భర్తల్ని పని కోసం విదేశాలకు పంపి.. లవర్లతో భార్యలు జంప్
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!