NTV Telugu Site icon

Kakani Govardhan Reddy: చంద్రబాబు డైరెక్షన్.. పవన్ యాక్షన్.. చెప్పిందే నిజమైంది

Kakani Dadisetty

Kakani Dadisetty

Kakani Govardhan Reddy Fires On Pawan Kalyan: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్కటేనని తాము గతంలోనే చాలాసార్లు చెప్పామని.. ఇప్పుడు దాన్ని వాళ్లు నిజం చేసి చూపించారని ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడిగా వ్యవహరించాడని.. ఇన్నాళ్లూ చంద్రబాబు డైరెక్షన్, పవన్ యాక్షన్‌గా సాగిందని.. ఎట్టకేలకు ఇప్పుడు ఇద్దరూ బయటపడ్డారని అన్నారు. ఆ ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం ఉన్న విషయాన్ని తాము ముందునుంచే చెప్తున్నామని, నేడు అది నిజమైందని తెలిపారు. పవన్ కళ్యాణ్‌కు ఒక అజెండా లేదని, వైసీపీ నేతలపై అతను చేసిన వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. ఒక పార్టీకి అధినేతగా ఉంటూ.. ఆ విధంగా మాట్లాడటం చూస్తే, పవన్ నైజం ఏంటో అర్థమవుతోందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఎన్నికల్లో పోటీ చేసినా.. ఒరిగేదేమీ ఉండదని తేల్చి చెప్పారు. 2024 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోరాటం చేసిందని.. 2024లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు, కాకినాడలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. సిఎం జగన్‌కు ప్రజల్లో ఉన్న పరపతిని ఎదుర్కోలేకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. కుల, మతాల మధ్య ఘర్షణలు పెడుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల టీడీపీ చేయించుకున్న సర్వేలో ఆ పార్టీకి అడ్రస్ లేనట్లు రిపోర్ట్ వచ్చిందని.. దీంతో లాభం లేదని గ్రహించిన చంద్రబాబు తన దత్తపుత్రుడు పవన్‌ను వెనకేసుకుని తిరుగుతున్నాడని విమర్శించారు. యువతను రెచ్చరొట్టి.. ఆ మంటల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చలి కాచుకోవాలనుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Show comments